మార్గదర్శి కేసుపై త్వరలో పుస్తకం: ఉండవల్లి

మార్గదర్శి కేసుపై త్వరలో పుస్తకం: ఉండవల్లి
తూర్పుగోదావరి : మార్గదర్శి కేసుపై త్వరలో పుస్తకం తీసుకు వస్తానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తెలిపారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పీల్‌ చేయాల్సి ఉందన్నారు. డబ్బు సంపాదించుకున్న కులంలో మనం మాత్రమే బాగుపడాలనే ఆలోచన వస్తే అది మిగిలిన వారికి ఇబ్బంది కలిగిస్తుందన్నారు. స్వతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆంధ్ర ప్రాంతంలో 2270 మంది ఎమ్మెల్యేలుగా నెగ్గితే వారిలో 1144 మంది అంటే 50.39 శాతం రెడ్డి, కమ్మ కులాలకు చెందిన వ్యక్తులు ఉన్నారని పేర్కొన్నారు. కులాలకు సంబంధించి కూడా ఓ పుస్తకం రాస్తానని ఉండవల్లి తెలిపారు. రాజధానికి 30 వేల ఎకరాలు దేనికని గతంలోనే అడిగానని, రాజధానికి భూములు త్యాగం కాదని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమేనని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 700 కోట్లు మిగల్చడం సరైనదేనని తెలిపారు. చంద్రబాబు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 53773 ఎకరాలు సీటీల అభివృద్ధి కోసం కావాలంటూ గ్రాఫిక్స్‌ చూపించారని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు మంచి నిర్ణయమని ప్రశంసించారు. మాజీ జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. దీనిపై టీడీపీ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షలు ఎన్ని ఆరోపణలు చేసినా.. ప్రజలు అత్యధిక ఓట్లు వేసి వైఎస్సార్‌సీపీని గెలిపించారని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
ఎస్కేప్ చానల్ నుండి రెండో పంటకు నీళ్ళు విడుదల చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
Image
నెల్లూరు నగరములో చోరీ::వృద్దురాలిపై దాడిచేసి బంగారు నగలు అపహరణ.
Image