జగన్ రాజకీయ జీవితంపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ భవితవ్యంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాయడంపై సునిశిత వ్యాఖ్యలు చేశారు. హోదా అనే వ్యవస్థే లేదని, అలాంటి లేని వ్యవస్థ కోసం మాట్లాడితే జగన్ రాజకీయంగా ఇబ్బంది పడతారని వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. ఏ రాష్ట్రానికి ఇవ్వనంతగా ఏపీకి కేంద్రం నిధులు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాకు బదులు ప్రాజెక్టుల కోసం రూ.22వేల కోట్లు అదనంగా కేంద్రం ఇచ్చిందన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని జగన్‌కు కూడా తెలుసునని అన్నారు. ప్రత్యేక హోదాను పునరుద్ధరించే ఉద్దేశం కేంద్రానికి లేదని జీఎల్ పునరుద్ఘాటించారు.
జగన్ రాజకీయ జీవితంపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు