దేశీయ వైద్య విధానాలకు జాతీయ హోదా నిజమేనా?

దేశీయ వైద్య విధానాలకు జాతీయ హోదా నిజమేనా?
 లోక్సభలో ప్రశ్నించిన ఎంపీ ఆదాల 
దేశీయ వైద్య విధానాలుగా ప్రఖ్యాతి గాంచిన ఆయుర్వేద, సిద్ధ, హోమియో, ప్రకృతి వైద్య విధానాలకు జాతీయ హోదాను ఇచ్చిన విషయం నిజమేనా అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం లోక్సభలో ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అశ్వనీకుమార్ చౌబే జవాబిస్తూ ఆ ప్రతిపాదన నిజమేనని రాతపూర్వకంగా తెలిపారు . జామ్ నగర్ లోని గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న దేశీయ వైద్య ప్రఖ్యాత సంస్థలకు జాతీయ హోదాను ఇచ్చేందుకు గాను కేంద్ర మంత్రివర్గ సంఘం తన ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. గుజరాత్ ఆయుర్వేద యూనివర్సిటీ పరిధిలో ఉన్న దేశీయ వైద్య విద్య పరిశోధనా సంస్థలన్నీ ఒక గొడుగు కిందకు తెచ్చి జాతీయ హోదాను ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించాల్సి ఉందని స్పష్టం చేశారు.