13.02.2020
తాడేపల్లి
- ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్.
- గుంటూరుజిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో సమీక్షించిన మంత్రి
- వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేదీ, శ్రీ పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ శ్రీ చిన్న తాతయ్య, పిఆర్ ఇఎన్ సి శ్రీ సుబ్బారెడ్డి, ఆర్ డబ్ల్యుఎస్ ఇఎన్ సి శ్రీ కృష్ణారెడ్డి తదితరులు.
- వీడియో కాన్ఫెరెన్స్ లోపాల్గొన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, పిఆర్, ఆర్ డబ్ల్యుఎస్ ఇంజనీరింగ్ అధికారులు
*మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్:*
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి.
అందుబాటులో వున్న మెటీరియల్ నిధులను సద్వినియోగం చేసుకోవాలి.
కొన్ని జిల్లాల్లో పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతోందని ఆరా తీసిన మంత్రి
బిల్లుల చెల్లింపుల్లో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని ఆదేశాలు
రెండు వారాలకు ఒకసారి బిల్లులు చెల్లించడం ద్వారా పనులు చేసే వారికి ప్రోత్సాహం కల్పించాలి
మొత్తం ఆరువారాల్లో ప్రారంభించిన ఉపాధి హామీ పనులను పూర్తి చేయాలి
ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టినప పనుల పురోగతిని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
ఉగాది నాటికి ప్రభుత్వం 25 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తోంది.
ఇళ్ళ స్థలాల చదును పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
మార్చి 1వ తేదీ నాటికి ఇళ్ళ స్థలాల చదును పనులు పూర్తి చేయాలి.
రాష్ట్రంలో సుమారు రూ.2 వేల కోట్ల విలువైన మెటీరియల్ నిధులు అందుబాటులో వున్నాయి.
ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 45 రోజుల్లో పనులను పూర్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలి.
ఇప్పటి వరకు 9,360 గ్రామ సచివాలయాల నిర్మాణానికి అనుమతి ఇచ్చాం.
వాటిల్లో 8,159 పనులు ప్రారంభమయ్యాయి.
దీనితో పాటు 17,376 సిసి డ్రైన్ పనులకు అనుమతి ఇవ్వగా..
దానిలో 15,375 పనులను ప్రాంభించారు.
మొత్తం 10,394 ఇళ్ళ స్థలాల చదును పనులకు గానూ 10,394 పనులు ప్రారంభించారు.
మొత్తం 10,227 పనులకు గానూ నాడు-నేడు లో భాగంగా 6,596 పనులు ప్రారంభించారు.
మొత్తం 1,21,582 సిసి రోడ్ల పనులకు గానూ 82,513 పనులు ప్రారంభించారు.
ఇంకా ప్రారంభం కాని వాటిని వెంటనే మొదలు పెట్టాలి.
ఆయా పనులకు గానూ నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు చొరవ తీసుకోవాలి.
ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు నివేదికలను పంచాయతీరాజ్ శాఖకు తెలియచేయాలి.
గ్రామ పంచాయతీ, గ్రామసచివాలయాల్లో సిబ్బంది, వలంటీర్లకు అవసరమైన సదుపాయాలను కల్పించాలి.
సొంత భవనాల లేని చోట త్వరితగతిన నూతన భవనాలను నిర్మించాలి.
సచివాలయాల్లో నియమించిన ఇంజనీరింగ్ సిబ్బంది సేవలను కూడా వినియోగించుకోవాలి.
ఉపాధి హామీ పనులకు ఇసుక కొరత లేదు.
అవసరమైన ఇసుకను మూడు శ్రేణుల ద్వారా సమీకరించుకునేందుకు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చాం.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ మెటీరియల్ నిధులను ఎక్కువగా వినియోగించుకోవాలి.
దానిని బట్టి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదే నిష్పత్తిలో నిధులు రాష్ట్రానికి కేటాయిస్తారు.
ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలి.
ఉపాధి హామీ నిధులతో గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలి.