*దిశా చట్టంపై విధ్యార్ధులు అవగాహన కలిగి ఉండాలి
(ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.ఓ పద్మావతి)
వింజమూరు: ఆంధ్రప్రదేశ్ దిశా చట్టంపై విధ్యార్ధులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని వింజమూరు స్త్రీ శిశు సం క్షేమ శాఖ సి.డి.పి.ఓ పద్మావతి పేర్కొన్నారు. గురువారం నాడు స్థానిక శ్రీ నేతాజీ వికాస్ డిగ్రీ కళాశాలలో విధ్యార్ధినిలతో ఆమె ప్రత్యేక సమావేశమును నిర్వహించారు. ఈ సందర్భంగా వై.యస్.ఆర్. కిషోర వికాసం, ఏ.పి దిశా చట్టం, బేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమాల లక్ష్యాలను విధ్యార్ధినిలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ ఎడ్యుకేటర్ బీబీజాన్, ఐ.సి.డి.ఎస్ సూపర్ వైజర్లు శ్రీదేవి, సుజాత, హైమావతి, సోషల్ వర్కర్ మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు....