తనిఖీలలో పట్టుబడ్డ వాహనాలు బహిరంగ వేలం
* డిటిసి ఎస్.వెంకటేశ్వరరావు వెల్లడి
విజయవాడ: తనిఖీలలో పట్టుబడ్డ వాహనాలను ఈ నెల 26, 27 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా డిటిసి ఎస్,వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక డిటిసి కార్యాలయంలో సోమవారం నాడు డిటీసీఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాహనాల తనిఖీల సమయంలో రికార్డులు చూపని వాహనాలపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరిగిందని, వాహన యజమానులకు నోటీసులు ఇచ్చాన కూడా ఎటువంటి స్పందన రాలేదని, అటువంటి వాహనాలను ఈ నెల 26, 27తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించనున్నామని డిటీసీ తెలిపారు. ఉయ్యూరు ఆర్టీసీ డిపోలో సీజ్ చేసిఉన్న 24 వాహనాలను 26న, ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో సీజ్ చేసిఉన్న 30 వాహనాలను 27న సీజ్ చేసి ఉంచిన ప్రాంతంలోనే రెండుచోట్ల వేలం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వేలంపాటలో పాల్గొనేవారు ధరావత్తు సొమ్ముగా రూ.5 వేలు వాహనాల వేలానికి ముందు సమయంలో చెల్లించాలన్నారు. వాహనాలు ఎక్కువ మొత్తంలో ఎవరైతే వేలం పాటలో పాడుకుంటారో వారు అదేరోజు మొత్తం సొమ్మును చెల్లించాలన్నారు. ఈ వాహనాలకు వ్యాట్ పన్ను కూడా వర్తిస్తుందని ఆయన తెలిపారు. నిర్బంధించిన వాహనాలకు చెల్లించాల్సిన మొత్తం సొమ్మును వాహన యజమానులు మంగళవారంలోగా చెల్లించినట్లైతే అటువంటి వాహనాలను వేలంపాట నుండి తొలగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. లేనిపక్షంలో యధావిధిగా బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
తనిఖీలలో పట్టుబడ్డ వాహనాలు బహిరంగ వేలం