ఏపీలో టెన్త్‌ పరీక్షలు వాయిదా

ఏపీలో టెన్త్‌ పరీక్షలు వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఈనెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి తేదీలను ఖరారు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంసెట్, ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల గడువునూ పొడిగిస్తున్నట్లు మంత్రి సురేష్ వెల్లడించారు. కాగా, ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పిటిషన్‌ను పరిశీలనకు హైకోర్టు ధర్మాసనం తీసుకుంది. అయితే వాయిదాపై ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కాసేపటికే పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image