*రాష్ట్ర మహా సభలను విజయ వంతం చేయండి*
*ఇప్పటికే అందరికి అక్రిడిటేషన్ లు ఇచ్చాం, ఇళ్ళ స్థలాలు వచ్చేలా కృషి చేస్తా*
*ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడి*
తూప్రాన్, మార్చి, 2.
మార్చి 8న ఆదివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే టియుడబ్ల్యుజె హెచ్ 143 రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపునిచ్చారు. సోమవారం తూప్రాన్ లో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి జర్నలిస్ట్ ల సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సమావేశానికి తూప్రాన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆంజనేయులు అధ్యక్షత వహించగా రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో 35 కోట్లు మంజూరు కాగా 259 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడంతో పాటు నెలకు 3 వేలు ఫెంషన్, పిల్లల చదువుకు 5 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు ఉద్యమించామని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా జర్నలిస్ట్ నాయకుడైన తనకు అవకాశం కల్పించారని అన్నారు.
ఈ సమావేశంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ వైస్ ఛైర్మన్ నందాల శ్రీనివాస్, యూనియన్ రాష్ట్ర నాయకులు మారుతి సాగర్, ఇస్మాయిల్, యూసుఫ్ బాబు, రమణ, యోగి, సీఆర్.జానకిరామ్, విష్ణు వర్ధన్ రెడ్డి, వర్దెల్లి వెంకన్న, జీ.యాదగిరి గౌడ్, ధారా సింగ్, భిక్షపతి తో పాటు తూప్రాన్ ప్రెస్ క్లబ్ నాయకులు పంజాల ఆంజనేయులు గౌడ్, దమ్మన్నగారి కృష్ణ, జీ.భాస్కర్, ఐ. రవిందర్, టి.నాగరాజు, కె.వేణు గోపాల్, పెద్దిగారి నగేష్ గుప్త, చెలిమేల నాగరాజు, గడ్డం ప్రశాంత్, చెంది శ్రీనివాస్, నర్సింహ్మ రెడ్డి, శివ కృష్ణ గౌడ్, రాజశేఖర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.