ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు

 


తేది:28.03.2020
అమరావతి


ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు


• ఆక్వా రంగం దెబ్బతినకుండా ఉండేందుకు అనేక చర్యలు 


• పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు 


• 30 కౌంట్ నుండి 100 కౌంట్ వరకు రొయ్యల ధర నిర్ణయం


• ఆక్వా రైతులు దళారుల మాటలను నమ్మవద్దు


• రైతులకు నష్టం కలిగించే దళారులు వ్యాపారులపై చర్యలు 


•  రైతులకు నష్టం కలిగిస్తే దుకాణాల లైసెన్సులు రద్దు  : రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ


అమరావతి, 28 మార్చి : నేటి నుండి ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ ప్రచార విభాగం ఎదురుగా ఉన్న పచ్చిక ఆవరణలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వల్ల ప్రజలకు ప్రాణనష్టం కలగకూడదని ఒకవైపు, నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకుంటూ మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. కరోనా ప్రభావం వల్ల ఆక్వా రంగంతో పాటు పౌల్ట్రీ రంగం కొంత ఇబ్బందులకు గురి అవుతున్న మాట వాస్తవమన్నారు. అంతేతప్ప కరోన వైరస్ వలన ఆక్వారంగ పరిశ్రమలు మూతపడతాయని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వ్యవసాయ,అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తూ వస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఆక్వా సాగుకు ఏప్రిల్, మే, జూన్ నెలలు చాలా కీలకమైన నేపథ్యంలో ఆక్వా రంగం దెబ్బతినకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి వివరించారు. అందులో భాగంగా ఆక్వా ఉత్పత్తుల ఎగుమతి దారులతో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు తానూ చర్చలు జరిపామన్నారు. ఆక్వా ఎగుమతిదారులు, సంబంధిత శాఖాధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో రెండు లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోందని, మన రాష్ట్రంలోని ఆక్వా ఉత్పత్తులకు నాణ్యత విషయంలో మంచి పేరుందని మంత్రి తెలిపారు. 90 శాతం ఉత్పత్తులు అమెరికా, చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్రం ఉలో ఆక్వా అత్యంత ప్రధానమైన, ఆదాయం అర్జించే రంగమని చెబుతూ ఆక్వా రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తున్నామన్నారు. దేశంలో 47 శాతం ఆదాయం, రాష్రం యలో ప్రధానంగా అత్యధిక ఆదాయం ఆక్వా రంగం నుండి వస్తుండటంతో రొయ్యల రైతులు నష్టపోకుండా ఏప్రిల్ 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 30 కౌంట్ నుంచి 100 కౌంట్ వరకు రొయ్యల ధర నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా ధరల పట్టికను మంత్రి చదివి వినిపించారు. 30 కౌంట్ కేజీ ధర రూ.430 కాగా, 40 కౌంట్ ధర రూ.310, 50 కౌంట్ ధర రూ.260, 60 కౌంట్ ధర రూ.240, 70 కౌంట్ ధర రూ.220, 80 కౌంట్ ధర రూ.200, 90 కౌంట్ ధర రూ.190, 100 కౌంట్ ధర 180 రూపాయలుగా నిర్ణయించామన్నారు. మార్కెట్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇలా ముందే స్థిరమైన ధరలు నిర్ణయించడం దేశంలోనే మొదటిసారి అని మంత్రి తెలిపారు. ఆక్వా రైతుల కోసం ఏ రాష్ట్రం కూడా ఇలాంటి చర్యలు తీసుకోలేదని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఆక్వా ఉత్పత్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగుమతులు ఆగడానికి వీలులేదన్నారు. 5,6 రోజులుగా ఇదే విషయమై జిల్లా యంత్రాంగం, ఆక్వా రైతు సంఘాలు, ఎగుమతిదారులతో చర్చలు జరిపుతున్నామన్నారు. కరోనాతో సంబంధం లేకుండా రైతు పండించిన పంటను ఏ ప్రాంతంలో అయినా కొనుగోలు చేయడానికి ఎగుమతిదారులు ముందుకు వచ్చిన విషయాన్ని  మంత్రి గుర్తుచేశారు. ఇది స్వాగతించాల్సిన అంశమని కొనియాడారు. ఆక్వా రైతులకు అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు. 


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆసరా చేసుకొని కరోనా వైరస్ పేరుతో దళారుల మాటలను నమ్మి ఆక్వారంగం రైతులు మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకు అమ్మేందుకు వీలు లేదని ఆక్వా రైతులకు సూచించారు. హడావిడిగా సాగుచేసిన ఉత్పత్తులను అమ్ముకోవద్దని రైతులను అభ్యర్థించారు. రైతులకు నష్టం కలిగించే దళారులు, వ్యాపారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు నష్టం కలిగిస్తే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నోడల్ ఏజెన్సీగా ఉన్న ఎంపెడా కు అధికారాలు ఇస్తున్నామని తెలిపారు. ఆక్వాకు సంబంధించిన ఉత్పత్తులు సీడ్ వేయడం, ఫీడ్ ను అందించడం, ప్రాసెసింగ్ నిర్వహణ, రవాణాలో ఎలాంటి అడ్డంకులు ఉండబోవన్నారు. ఈ విషయంలో పోలీస్, రెవెన్యూ, వాలంటీర్లు సహకరించాలన్నారు. ఎగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు సంబంధించి ఎక్స్ పోర్ట్ ఇన్స్పెక్షన్ అథారిటీ(ఈఐఏ)నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ అందించే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లాకు మత్స్యశాఖకు చెందిన జాయింట్ డైరెక్టర్ ను నోడల్ ఆఫీసర్ గా నియమిస్తున్నామన్నారు. ఏ ఇబ్బందులున్నా వీరితో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు. విదేశాల నుంచి  రా మెటీరియల్  తెప్పించే విషయంలో వీరు పనిచేస్తారన్నారు.  అదే విధంగా ఆక్వా పరిశ్రమలో పనిచేసే సిబ్బంది సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందిగా మంత్రి సూచించారు. శానిటైజర్స్ ను వినియోగించాలన్నారు.  సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూశాఖ పాస్ లు జారీ చేస్తుందన్నారు. నోడల్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. మానిటరింగ్ కమిటి ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కు  ఫిర్యాదులు చేయవచ్చన్నారు. 


ఫౌల్ట్రీ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటుందంటున్న మాట వాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. ఈ రంగంపై ఆధారపడి చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఈ రంగం కుదేలవుకుండా నిలబెట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుడ్లు, చికెన్ ను మార్కెట్ లో అమ్ముకునేందుకు, రవాణాకు అన్ని  చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదే విధంగా ఆక్వా, మత్స్య, ఫౌల్ట్రీ నుంచి వచ్చే వ్యర్థపదార్థాలను రవాణా చేసేందుకు అన్ని రకాల అనుమతులు ప్రభుత్వం చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఫౌల్ట్రీ రంగం రూ.60 లక్షలు అందజేసిందన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.


రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామ,వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇతర దేశాల నుంచి గడచిన రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు 25 వేలకు పైగా మంది వచ్చారని తెలిపారు.  ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.  కరోనా మహమ్మారి నుంచి ఉపశమనం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. లక్షలాది మంది రైతుల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కృషిచేస్తున్నారని మంత్రి మోపిదేవి తెలిపారు.


అంతకుముందు ఆక్వా ఎగుమతిదారులు, మత్య్ శాఖాధికారులతో మంత్రి మోపిదేవి తన ఛాంబర్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.


సమావేశంలో వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మత్య్ శాఖ కమిషనర్ సోమశేఖర్, ఎంపెడా జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఆక్వా ఎగుమతిదారులు, మత్య్ఆశాఖ అధికారులు పాల్గొన్నారు.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image