ఈనెల 31 వరకు రాష్ట్రమంతా లాక్‌డౌన్‌

*22.03.2020*
*అమరావతి*


*తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో మీడియాతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌:*


*ఈనెల 31 వరకు రాష్ట్రమంతా లాక్‌డౌన్‌*


*ప్రజా రవాణా వ్యవస్థ, ప్రైవేటు వాహనాల నిలిపివేత*


*రాష్ట్ర సరిహద్దుల మూసివేత, ప్రజలు సహకరించాలి*


*అత్యవసర సేవలు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి*
*ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు*
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి*


*ప్రతీ పేద కుటుంబానికి  ఈనెల 29 నాటికి రేషన్‌ సరుకులు రెడీ*
*కేజీ పప్పుతో పాటు, రేషన్‌ సరుకులు ఉచితంగా ఇస్తాం*
*మరో రూ.1000 ఆర్థిక సహాయం*


*ఏప్రిల్‌ 4న గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఇస్తారు*
*మీడియా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*


*సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌ – ముఖ్యాంశాలు:*


– దేశంలో కరోనా వ్యాపిస్తోంది. రాష్ట్రం అలాంటి పరిస్థితుల్లోకి పోకుండా కృషి చేసిన గ్రామ వలంటీర్లు, ఆశా వర్కర్లు, వైద్యులు, సిబ్బందికి, ఆ శాఖకు, కలెక్టర్లు, అధికారులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు.
– దేశంలో దాదాపు 341 కేసులు నమోదైతే, మరో 5గురు చనిపోతే, మన రాష్ట్రానికి వచ్చే సరికి కేవలం 6 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులోనూ ఒక కేసు నయమైపోయి, డిశ్చార్జ్‌ కూడా అయ్యారు.
– విదేశాల నుంచి వచ్చిన 11,670 మందిని ట్రాక్‌ చేయడంతో పాటు, వారిపై నిఘా పెట్టాం.
– 10,091 మందిని ఐసొలేషన్‌లో ఉంచాం. 24 మందికి ఆస్పత్రిలో చికిత్స అందించాం.
– మరో 1550 మందిని హోం ఐసొలైసేషన్‌ లో ఉంచడం జరిగింది.ఐసొలేషన్‌ సెంటర్లు 
                           
*ఐసోలేషన్ సెంటర్లు*   
                                                                                                                                                             – రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో ఐసొలేషన్‌ సెంటర్‌ సౌకర్యం ఏర్పాటు. 
– ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 200 పడకలతో ఏర్పాటు చేయాలని ఆదేశం.


*విద్యాసంస్ధలు-మాల్స్ మూసివేత*


– ఇప్పటికే విద్యా సంస్థలు, కళాశాలలు మూసివేయడం జరిగింది. ఈనెల 31 వరకు అవి పని చేయవు.
– 10వ తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయి.
– అన్ని సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్స్, సోషల్‌ ఈవెంట్స్‌ సెంటర్లు కూడా 31 వరకు మూసివేయాలని ఆదేశం.
– పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాల్లో దర్శనాల నిలిపివేతకు ఆదేశాలు జారీ చేశాం.


*రవాణా వ్యవస్థలు*
– ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్‌రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థను ఆపేశాయి. సరిహద్దులు మూసేశాయి.
– మనం కూడా ఆ దిశలో అడుగులు వేయక తప్పదు. అంతర్‌రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థను ఈరోజు నుంచి నిలిపివేస్తున్నాం.
– ఇందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థ కట్టడి. అన్ని సర్వీసులు ఆపేస్తాం.
– ఆటోలు, టాక్సీలను అత్యవసర సర్వీసులకు మాత్రమే వినియోగించాలి. అది కూడా కేవలం ఇద్దరిని మాత్రమే ఎక్కించుకోవాలి.
– రాష్ట్రమంతా లాక్‌డౌన్‌ పరిస్థితి. బట్టలు, నగలు, బంగారం దుకాణాలు (నాన్‌ ఎస్సెన్షియల్‌ షాప్స్‌) కూడా ఈనెల 31 వరకు మూసేయాలని గట్టిగా కోరుతున్నాం.


*ప్రభుత్వ ఉద్యోగులు*
– ప్రభుత్వం కూడా కేవలం స్కెలెటన్‌ స్టాఫ్‌తో రొటేషన్‌ పద్ధతిలో ఉద్యోగులతో పని చేస్తుంది.


*విదేశాల నుంచి వచ్చే వారు పాటించాల్సినవి*
– విదేశాల నుంచి వచ్చే వారందరినీ కూడా కోరుతున్నాం. 
– వారంతా తప్పనిసరిగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని గట్టిగా కోరుతున్నాం.


*ప్రజలకు విన్నపం*
– ప్రజలందరికీ కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రం కూడా రైళ్లను రద్దు చేసింది. 
– ఇప్పటికే 12 రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. మిగిలినవి కూడా రేపటి నుంచి చేయొచ్చు.
– 14 రోజులు చేస్తే, పరిస్థితి చక్కబడుతుంది. అందువల్ల కనీసం ఈనెల 31 వరకు దాన్ని అమలు చేయాల్సి ఉంది.
– ఆ తర్వాత పరిస్థితి, కేంద్రం ఏం చెబుతుందన్నది చూసి నిర్ణయం
– మరీ అవసరమైతేనే బయటకు రండి. అత్యవసరాల కోసం మాత్రమే బయటకు రండి. 
– అలా వచ్చినప్పుడు కనీసం 3 అడుగుల దూరంలో ఉండండి. దీనికి అందరూ సహకరించాలి
– పోలీసు కూడా విదేశాల నుంచి వచ్చిన వారిపై గట్టిగా నిఘా పెడతాం. వారికి పోలీసులను అటాచ్‌ చేస్తాం. 
– పోలీసు స్టేషన్లు కూడా తమ పరిధిలో ఏం జరుగుతుందన్నది చెప్పాలి.
– గ్రామ పోలీసులు కూడా శ్రద్ధ చూపాలి. అందరూ ఇళ్లలోనే ఉండేలా చూడాలి.


*ధరలు పెంచితే కఠిన చర్యలు*
– నిత్యావసరాల ధరలు పెంచవద్దు. అలా పెంచితే కఠిన చర్యలు తీసుకుంటాము. జైలుకు పంపడానికి కూడా వెనుకాడబోము.
– కలెక్టర్లు కూడా దీనికి సంబంధించి ప్రకటన చేస్తారు. సరుకుల ధరలు ప్రకటిస్తారు. కూరగాయలతో సహా.. అన్ని ధరలు ప్రకటిస్తారు.
– ఆ ధరల కంటే ఎవరైనా ఎక్కువకు అమ్మితే కఠిన చర్యలుంటాయి.
– ఒక టోల్‌ఫ్రీ నెంబరు కూడా ఇస్తారు. దానికి కాల్‌ చేస్తే, పోలీసులు కూడా యాక్టివేట్‌ అవుతారు.


*అసెంబ్లీ కూడా పరిమిత రోజులే*
– 10 మందికి మించి ఎక్కడా గుమి కూడవద్దు.
– నిజానికి అసెంబ్లీ కూడా ఉండొద్దు.
– కానీ బడ్జెట్‌ కోసమే నిర్వహణ. వీలైనంత తక్కువ రోజులు నిర్వహిస్తాము.


*రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి*
– రైతులు, రైతు కూలీలు కూడా వీలుంటే పనులకు వెళ్లకండి.
– ఒకవేళ వెళ్లాల్సి వస్తే 3 అడుగుల దూరం మెయిన్‌టెయిన్‌ చేయండి.                                           *ఎవరూ ఆందోళన చెందవద్దు*
– అత్యవసర, నిత్యావసరాలు.. పెట్రోల్, గ్యాస్, ఔషధాల షాపులు, పాలు, కూరగాయాలు, కిరాణం షాపులు తెరిచే ఉంటాయి.
– ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. 2 శాతం కంటే ఉండదు.
– అది కూడా వయసు ఎక్కువ ఉండడంతో పాటు, తీవ్ర అనారోగ్యం ఉన్న వారే చనిపోతారు.
– 80.9 శాతం ఇళ్లలోనే ఉండి నయం అయ్యారు. కేవలం 13.8 శాతమే ఆస్పత్రికి. అందులో 4.7 శాతమే ఐసీయూలో చికిత్స చేశారు.
– జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్‌ వేగంగా వ్యాపిస్తుంది.


– అవ్వాతాతలు బయటకు వెళ్లొద్దు. 10 ఏళ్లలోపు పిల్లలను బయటకు పంపొద్దు.
– అందరూ కూడా ఈనెల 31 వరకు దయచేసి ఇళ్లలోనే ఉండండి. ఎక్కడికీ కదలొద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
– విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. హోం ఐసొలేషన్‌లో ఉండాలి.


*నిరుపేదలకు సహాయం*
– ఈనెల 29వ తేదీ నాటికి రేషన్‌ పూర్తిగా అందుబాటులో ఉంచుతాం.
– రేషన్‌ సరుకులు ఉచితంగా ఇస్తాం. దాంతో పాటు ఒక కేజీ పప్పు ఉచితంగా ఇస్తాం.
– ప్రతి కుటుంబానికి రూ.1000. ఏప్రిల్‌ 4న గ్రామ వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తాం. 
– దీనికి మాత్రమే దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు.


*అందరితో కలిసి అడుగులు*
– ప్రజలు పరిస్థితులను గమనిస్తున్నారు కాబట్టి అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
– అందరం ఒకటి కావాలి. దేశమంతా ఏకమవుతుంది. అందరూ ఒకే రకమైన అడుగులు వేస్తున్నారు.
– అవే అడుగులు మనం కూడా వేయగలిగితేనే దీన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయగలుగుతాం.
– కాబట్టి అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.