రాజ్యసభ నామినేషన్లు అన్నీ ఆమోదం

రాజ్యసభ నామినేషన్లు అన్నీ ఆమోదం
అమరావతి : రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఖాళీ అయ్యే నాలుగు స్థానాలకు ఈనెల 26వ తేదీన పోలింగ్‌ జరగనుంది. అధికార వైసీపీ తరఫున మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావు, పారిశ్రామికవేత్తలు అయోధ్యరామిరెడ్డి, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ సన్నిహితుడు పరిమళ్‌ నత్వాల్‌ బరిలో ఉన్నారు. వైసీపీకి 151 శాసనసభా స్థానాలు ఈ నాలుగు స్థానాలూ ఈ నలుగురికీ ఏకగ్రీవం అవుతాయని భావించారు. కానీ 23 శాసనసభా స్థానాలు కలిగిన తెలుగుదేశం పార్టీ ఆకస్మికంగా వర్ల రామయ్య అభ్యర్థిగా రంగంలోకి దింపింది.  ఈ నామినేషన్ల పరిశీలించి అన్నింటినీ ఆమోదించినట్లుగా అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్‌ అధికారి బాలకృష్ణమాచార్యులు వెల్లడించారు. అయితే ఈ నెల 18 వరకూ నామినేషన్ల ఉపసంహణకు గడువు ఉంది.