జగన్ కు 5కోట్ల మంది ఆరోగ్యం కంటే, 5వేలకోట్లే ముఖ్యమయ్యాయి

విలేకరుల సమావేశం వివరాలు (16.03.2020.)


జగన్ కు 5కోట్ల మంది ఆరోగ్యం కంటే, 5వేలకోట్లే ముఖ్యమయ్యాయి


·       ప్రజలప్రాణాలకు హాని లేకుండా చూడటం కోసం ఎన్నికల కమిషనర్ ఎన్నికలు వాయిదావేస్తే, దాన్ని తప్పుపడతారా?


·       నిమ్మగడ్డతో ఒకే కంచం, ఒకే మంచం పంచుకున్నప్పుడు జగన్ కు కులం గుర్తురాలేదా?


·       తన సంస్థల్లో ప్రసాద్ పెట్టుబడులు పెట్టినప్పుడు కమ్మగా ఫీలయిన జగన్ కు, ఎన్నికల కమిషన్ ప్రకటన చలిపుట్టించింది.


·       కడప జిల్లా వ్యాప్తంగా జరిగిన ఏకగ్రీవాలన్నీ అధికారులు, పోలీసుల అండతో, అధికారపార్టీ నేతల బెదిరింపులతో జరిగినవే.     


                      శ్రీ బీ. చెంగల్రాయలు (ఎమ్మెల్సీ)


జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు కులాన్ని ఆపాదించడం, ఎన్నికల కమిషన్ విధులను భూతద్దంలోచూపుతూ, స్వతంత్రబద్దంగా వ్యవహరించే సంస్థను నిలువరించాలని చూడటం సీఎంకు సరికాదని టీడీపీనేత, ఆపార్టీ ఎమ్మెల్సీ బీ.చెంగల్రాయలు హితవుపలికారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించకుండా, వ్యవస్థలను నాశనం చేయడమేగాకుండా, ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేవారిపై నిందలే యడం ముఖ్యమంత్రికే చెల్లిందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంపై కేంద్రప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంటే, అవేమీ తనకు పట్టవన్నట్లుగా ముఖ్యమంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వేగంగా వ్యాప్తిచెందుతున్న  కరోనా ప్రభావాన్ని గుర్తించి, దానితీవ్రత ఉధృతమవకుండా నిరోధించడంకోసం, ప్రజల ప్రాణాలకు హాని లేకుండా చేయడంకోసం ఎన్నికల కమిషనర్, స్థానిక ఎన్నికలు వాయిదావేస్తే, ఆయన్ని దోషిగా చిత్రీకరించడం జగన్ వంటి అవకాశవాదికే  చెల్లిందన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అవసరమైనప్పుడల్లా, కులాలప్రస్తావన తీసుకొస్తున్న ముఖ్యమంత్రి జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ ది ఏకులమో, ఆయనద్వారా తన సంస్థల్లోకి పెట్టుబడులుఎలా పెట్టించాడో సీఎం సమాధానం చెప్పాలన్నారు. నిమ్మగడ్డతో కలిసి ఒకే కంచాన్ని, ఒకేమంచాన్ని పంచుకున్న జగన్మోహన్ రెడ్డికి, ఆనాడు గుర్తురాని కులం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని చెంగల్రాయలు నిలదీశారు. నిమ్మగడ్డ ప్రసాద్ తన సంస్థల్లో రూ.700కోట్లు పెట్టుబడులు పెట్టినప్పుడు కమ్మగా ఫీలయిన జగన్ కు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రకటనతో చలి మొదలైందన్నారు. ఎన్నికల కమిషన్  అనేది కళ్యాణ మండపం లాంటిదని, ఎన్నికలు జరిగేటప్పుడు అది కళకళలాడుతుందని, మిగతా సందర్భాలలో వెలవెలబోతుందన్నారు. ఎన్నికల కమిషనర్ ని నియమించేది గవర్నర్ అనే విషయం కూడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నాడన్నారు. కడప జిల్లా కోడూరులో ఒక ఎస్సై, నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రతిపక్షపార్టీ అభ్యర్థిని ఎత్తుకెళ్లి బయటపడేశాడని, అతను అంత అత్యుత్సాహం ఎందుకు చూపాడని చెంగల్రాయలు మండిపడ్డారు. నామినేషన్ పత్రాల్లో చిన్నచిన్న తప్పులను పట్టించుకోవాల్సిన పనిలేదని ఎన్నికల కమిషన్ చెప్పినాకూడా, రాష్ట్రంలోని అధికారులు ఆ ఆదేశాలను పట్టించుకోకుండా, కుంటిసాకులు చెబుతూ, అడుగడుగునా ప్రతిపక్షపార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం జరిగింద న్నారు. నామినేషన్ల అంశంలో పరిశీలన అనే పదానికి తీసేయడమనే అర్థం వచ్చేలా అధికారులు వ్యవహరించారన్నారు. పోలీసులు కూడా అభ్యర్థులను అడ్డుకోవడం, అధికారపార్టీ నేతలుచెప్పినవిధంగా ప్రవర్తించడం జరిగిందన్నారు. అభ్యర్థి, బలపరిచే వ్యక్తి లేకుండానే కడప జిల్లాలో చాలాచోట్ల ఎన్నికల నామినేషన్ ను ముగించారన్నారు. తన సొంత జిల్లాలో జరిగిన అనేక సంఘటనలు, ఎన్నికల్లో గెలుపుకోసం చేసిన ఆకృత్యాలపై జగన్ ఏం సమాధానం చెబుతాడో చెప్పాలన్నారు. కోడూరు మండలం రెడ్డివారిపల్లెలో ప్రతిపక్షపార్టీ అభ్యర్థి ఇంట్లో ఎక్సైజ్ అధికారులే మందుసీసాలు పెట్టారని, ఆ తరువాత డీఎస్పీస్థాయి అధికారి నేరుగా సదరు అభ్యర్థి ఇంటికెళ్లి, నీమీద కేసుపెడతాను..నువ్వు నామినేషన్ వేయడానికి వీల్లేదని అతన్ని బెదిరించడం జరిగిందన్నారు. ఇదేవిధంగా అనేకచోట్ల అభ్యర్థులను పలురకాలుగా బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేసి, ఆస్థానాలను ఏకగ్రీవమైనట్లుగా చెప్పుకోవడం అధికారపార్టీకే చెల్లిందన్నారు. వచ్చిన నామినేషన్లు పరిశీలించి అర్హులెవరో, అనర్హులెవరో తేల్చాల్సిన అర్డీవో స్థాయి అధికారులు కూడా తమ విధులను సరిగా నిర్వర్తించలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని నడివీధిలో వివస్త్రను చేసేలా కడపజిల్లాలో అనేక సంఘటనలు జరిగాయన్నారు. జిల్లావ్యాప్తంగా జరిగిన 45 సంఘటనలకు సంబంధించి ఆధారాలను తాము ఎన్నికల కమిషనర్ ముందుంచుతున్నా మని, అవి పరిశీలించి వారేం చర్యలు తీసుకుంటారో చూస్తామన్నారు. హింసకు పాల్పడిన అధికారులు, పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకొని, వారిని సస్పెండ్ చేయాలని ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ట్ర డీజీపీ మాదిరిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా కోర్టుల్లో నిలబడే పరిస్థితి తెచ్చుకోవద్దని టీడీపీ ఎమ్మెల్సీ సూచించారు. జగన్మోహన్ రెడ్డికి 5కోట్లమంది ప్రజలకంటే, 5వేల కోట్ల డబ్బులే ముఖ్యమైపోయాయని, ఆ డబ్బు ఎక్కడికీ పోదని ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు. రాష్ట్రప్రభుత్వం నిబద్ధతతో ఎన్నికలు నిర్వహిస్తే, ఒక్కపైసా కూడా బయటకు పోదని, ప్రభుత్వానికి నిజంగా సత్తా ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో నిర్వహించాలని చెంగల్రాయలు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వ, నియంతృత్వ చర్యలను ప్రకృతే కరోనా రూపంలో వచ్చి కట్టడి చేసిందన్నారు.  


 


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image