కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎన్నికలను 6 వారాలపాటు వాయిదా వేయడం పై హర్షం వ్యక్తం చేసిన బివి.జయ నాగేశ్వర్ రెడ్డి,
ఎమ్మిగనూరు, మార్చి, 16 (అంతిమతీర్పు):-ఎమ్మిగనూరుపట్టణ నియోజకవర్గ టిడిపి మాజీ శాసన సభ్యులు డా. బివి.జయనాగేశ్వర రెడ్డి గారి స్వగృహంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి రోజున ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న కరోన వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాలు పాటు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.రాష్ట్రంలో స్థానిక సంస్థలు రీ షెడ్యూల్ చేసి జరపాలని ఎన్నికల కమిషన్ను కోరుతూ, స్థానిక సంస్థల ఎన్నికలలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జరిగిన అవకతవకలు గురించి సాక్షాధారాలతో సహా ఎన్నికల కమీషన్ కు సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు కరోన వైరస్ పెద్ద ప్రాణాంతకం కాదు. దానికి పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటే సరిపోతుంది అనిచెప్పడం చూస్తే చాలా వ్యంగ్యాస్త్రం గా మాట్లాడుతున్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని సూచించారు. ఒక బాధ్యతగల ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కరోనా వైరస్ వల్ల వ్యంగ్యంగా మాట్లాడటం పై తీవ్రంగా నిరసిస్తూ కరోన వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కరోనా వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి పార్టీ నాయకులు చేసిన బెదిరింపులు, అరాచకాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమీషన్ ను కోరి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా రీ షెడ్యూల్ చేయాలనికేంద్ర ఎన్నికల కమిషన్ ఆధీనంలోనే, కేంద్ర బలగాలు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు.