రాజ్యసభకు తెదేపా అభ్యర్ధిగా వర్ల రామయ్య నామినేషన్

తేది : 13.03.2020
అమరావతి


రాజ్యసభకు తెదేపా అభ్యర్ధిగా వర్ల రామయ్య నామినేషన్


అమరావతి,13 మార్చి : ఈ నెల 26న రాజ్యసభకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి వర్ల రామయ్య శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఇన్ చార్జ్ కార్యదర్శి,ఎన్నికల అధికారి బాలకృష్ణమాచార్యులను కలిసిన వర్లరామయ్య రెండుసెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ పత్రాలను స్వీకరించిన ఎన్నికల అధికారి ఈ నెల 16న  నామినేషన్ పత్రాల పరిశీలనకు హాజరు కావాలని తెలిపారు. ఆ సమయంలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని బాలకృష్ణమా చార్యులు పేర్కొన్నారు. 


ఈ కార్యక్రమంలో తెదేపా రాజ్యసభ అభ్యర్ధి వర్ల రామయ్య వెంట ఆయన తనయుడు కుమార్ రాజ, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు,దేవినేని , విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మెహనరావు, ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.