టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, శ్రీ నారా చంద్రబాబు నాయుడి
విలేకరుల సమావేశం వివరాలు. - (14.03.2020.)
రాష్ట్రంలో పోలీస్ టెర్రరిజం
· పోలీసులే టెర్రరిజానికి పాల్పడితే రాష్ట్రం అగ్ని గుండమే
· ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ప్రజలంతా ఉద్యమించాలి.
“రాష్ట్రంలో యథేచ్ఛగా పోలీస్ టెర్రరిజం-ఖాకీ టెర్రరిజం కొనసాగుతోంది. పోలీసులే టెర్రరైజ్ చేస్తే, పోలీసులే టెర్రరిజానికి పాల్పడితే, ఆ రాష్ట్రం ఒక అగ్నిగుండంగా మారుతుంది. అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది. నామినేషన్లు వేసిన నాటి నుంచీ, ఎన్నివిధాలా అడ్డుకోవచ్చో, అన్నివిధాలా అడ్డుకోవడం..
దానికోసం ఒక నల్లచట్టం తీసుకోవడం. వీళ్లకు కావాల్సిన ఆంక్షలన్నీ అందులో పెట్టుకోవడం. చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి దాడులకు పాల్పడటం.
ప్రజాప్రతినిధులుగా పోటీచేసేవాళ్లపై దాడులు. ప్రజాస్వామ్యంపై దాడులు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, చట్టపరంగా, రాజ్యాంగం ప్రకారం ఎవరైతే పనిచేయాలో అలాంటిది పోలీసులే వాటిని ఉల్లంఘించడం. ఈ టెర్రరిజం మామూలుగా లేదు.
ఇనిస్టిట్యూషనలైజ్ చేయడం.
ఎవరైనా చట్టప్రకారం పనిచేయాలన్నా వీలుకాని టెర్రరిజం క్రియేట్ చేశారు. వాళ్లపై కూడా టెర్రిరిజం చేసి, వాళ్లు కూడా హెల్ప్ లెస్ అయ్యే పరిస్థితి తెచ్చారు.
అధికారం ఉంది కదా.. మేము నామినేట్ చేసుకంటాం అని చెప్పివుంటే ప్రజలకు ఈ బాధలు, కష్టాలు, శారీరక హింస,మానసిక హింస తప్పేవి. ఒకపక్క మానసికంగా ఆందోళనకు గురిచేయడం, ఇంకోపక్కన ఆర్థిక మూలాలు దెబ్బతీసేవిధంగా ప్రయత్నం చేయడంతో రాష్ట్రంలో ఒక భయానకమైన వాతావరణం సృష్టించి, భయభ్రాంతులకు గురిచేయడం. ఏ ప్రజలైతే రాజ్యాంగ బద్ధంగా పనిచేయాలనుకుంటున్నారో, వారిని ఆ పని చేయకుండా చేయడం.
ఎప్పుడూ చూడని వాతావరణం రాష్ట్రంలో సృష్టించారు. అనేక దాడులు చేశారు నామినేషన్ల సమయంలో. అవన్నీ ప్రతిఘటించి మారువేషాల్లో వెళ్లి నామినేషన్లు వేసే పరిస్థితి. అప్పటికి ఫలితాలు రాలేదు. అవైన తరువాత స్కూటినీలో మళ్లీ అరాచకాలు చేశారు. అడ్డగోలుగా స్కూటినీలో ఏకపక్షంగా చేశారు. ఇప్పుడు మళ్లీ విత్ డ్రావల్ లో అదే హింస, వేధింపులు చేస్తున్నారు. ప్రలోభాలు పెట్టారు, డబ్బులిచ్చారు, బెదిరించారు. పోలీసులే టెర్రరైజ్ చేసే పరిస్థితికి వచ్చారు. దాంతో చాలామంది అవన్నీ తట్టుకోలేక, హింస భరించలేక సరెండర్ అయ్యే పరిస్థితికి వచ్చారు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే సందర్భం”
జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలను విలేకరులకు ప్రదర్శించారు
అద్దంకి నియోజకవర్గంలో సంఘటన ఈ వీడియోలో చూడండి.
పోలీసు వ్యవస్థ ఎంతగా బరితెగించి పనిచేస్తుందో చూడండి. అభ్యర్ధులను కొట్టే హక్కు ఎవరిచ్చారు పోలీసులకు.. ఇది పోలీస్ టెర్రిరిజం కాక మరేమిటి? నిజాయితీగా, బాధ్యతతో బతికే పౌరులు ఎన్నికల్లో పోటీచేస్తున్నారని, వారిని హింసిస్తారా? జైళ్లకు వెళ్లొచ్చిన వైసీపీనేతలకు సిగ్గులేదు కాబట్టి, అందరూ కూడా వాళ్లమాదిరే సిగ్గులేకుండా ఉంటారని అనుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ కి తీసుకెళితే, ఎంత అవమానంగా ఫీలవుతారు?
ఆ దెబ్బలను తట్టుకోలేక సరెండర్ అవుతున్నారు అంతా..ఏంటి వాళ్లు చేసిన తప్పు.. ఎంతమంది ఇలా మానసిక ఆందోళన, శారీరక బాధలు భరించాలో ప్రజలే అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం పోటీచేయడమే వాళ్లు చేసిన తప్పా..?
ఆడవాళ్లపై బైండోవర్ కేసులు పెట్టడం ఏంటి..?
జగ్గంపేటలో ఏం జరిగిందో, ఈ వీడియోలో చూడండి....
ఈస్ట్ గోదావరిలోని జగ్గంపేటలో ఒకతను పోటీచేస్తే, పోలీసులకేం పని అక్కడ. భార్యా,భర్త తమకు తాముగా మేము పోటీచేస్తున్నామని చెబితే, ఎవడో చెప్పాడని చెప్పి, పోలీసులు అక్కడ టెర్రిరిజం చేస్తారా... అది ఖాకీ టెర్రిజం కాక మరేమిటి? వైసిపి డ్రస్సులు వేసుకుని పనిచేయండి కావాలంటే..ఖాకీ దుస్తులు వేసుకుని తప్పుడు పనులుచేయడం, వైసిపి వాళ్లకు అనుకూలంగా చేయడం ఏంటి..డిజిపి దానికి సమాధానం చెప్పాలి.
ధూళిపూడి-1ఎంపిటిసి మల్లేశ్వరి మాటలు ఈ వీడియోలో వినండి..
గుంటూరుజిల్లాలో ధూళిపూడి ఎంపిటిసి-1 అభ్యర్ధి మల్లీశ్వరి ఇంటికి వెళ్లి బెదిరించాల్సిన అవసరం పోలీసులకు ఏం వచ్చింది..? కేసులు పెడతామంటారా? ఎంపీటీసి ఇంటికెళ్లి బెదిరించాల్సిన అవసరం పోలీసులకు ఏం వచ్చింది. డిజిపి సమాధానం చెప్పాలి.
సత్యవేడులో మరో సంఘటన. రాజగుంట ఎంపిటిసి అభ్యర్థి పాలగిరి అమ్ములు నామినేషన్ వేశారు, ఆమె భర్త మల్లిఖార్జున్, రాత్రి రెండున్నర గంటలకు వాళ్లింట్లోకి వెళ్లి మద్యం సీసాలు పెట్టి, ఆ అమ్మాయిని ఇష్టారాజ్యంగా బెదిరిస్తూ జీపులో ఎక్కించుకొని విత్ డ్రా సమయం అయ్యేదాకా ఊరంతా తిప్పారు. సమయం అయిపోయాక దారిలో వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు ఇంటికి వచ్చి బాటిల్స్ ఉన్నాయనడంతో ఆమె భర్త భయపడిపోయి, లోపలికి వెళ్లి తలుపులేసుకున్నాడు. తెల్లారక బయటకు వస్తే, జీపులో ఎక్కించి, తీసుకెళ్లి బెదిరించారు. ఇది టెర్రరిజం కాదా?
పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మల్లమ్మడి హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్న తెలుగుదేశం పార్టీ గ్రామ కన్వీనర్ మైలే రామచందర్ ఇంటికెళ్లి రాళ్లతో దాడిచేశారు. ఇంటి తలుపులు పగులకొట్టి .... 11మంది ఎంపీటీసీ అభ్యర్థులను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. తనకు అడ్డొచ్చిన ట్రైనీ డీఎస్పీపై, కానిస్టేబుళ్లపై ఎమ్మెల్యేనే చేయిచేసుకున్నారు. (ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు).
వివేకానంద రెడ్డిని దారుణంగా నరికారు. తలలో మెదడు బైటకొచ్చేదాకా నరికారు. దానిని గుండెపోటుగా చిత్రించి మాఫీ చేయాలని చూశారు. గాయాలను చూసిన వివేకా కూతురు ఇది హత్య అని సహజ మరణం కాదని బైటపెట్టింది. ఇల్లంతా రక్తం.. బాత్రూమ్ నిండా రక్తం. చనిపోయాక శవానికి కట్లుకట్టారు. ఎవరూ సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డి మామ గంగిరెడ్డి, భారతి తండ్రి. ఎవరు చంపారు.. భారతి మేనమామ, వీళ్లేనని చెప్పి ప్రపంచమంతా తెలుసు. అందరూ ఇంటిదొంగలే. హత్య జరిగాక అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి సాక్ష్యాలు రూపూమాపాలని ప్రయత్నించారు. చివరకు ఆ అమ్మాయి (వివేకానందరెడ్డి కూతురు) పోరాడి సీబీఐ విచారణకు ఇప్పించింది.
నేను విశాఖలో పర్యటనకు అనుమతి తీసుకుని వెళ్తే, మాజీ ముఖ్యమంత్రినని కూడా చూడకుండా, 151కింద నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పమన్నాను. ఏరూల్ కింద, ఏచట్టం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారో లిఖితపూర్వకంగా తెలియచేయాలన్నాను. పోలీస్ స్టేషన్ కైనా, జైలుకైనా వస్తాను అని చెప్పాను. అవేవీ పట్టించుకోకుండా 151కింద నోటీస్ ఇస్తే, కోర్టులో ఏమైందో చూశారుగా? డీజీపీ 5.40 ని.షాల వరకు నిలబడే పరిస్థితి.
మాచర్లలో పట్టపగలు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నపై, న్యాయవాది కిశోర్ పై హత్యాయత్నం చేశారు. వాళ్లు ఇప్పుడంటున్నారు... మాచర్లలో స్కెచ్ వేస్తే ఇంతవరకూ ఎవరూ తప్పించుకోలేదంట...వీళ్లు తప్పించుకున్నారట. ఇంకో ఘటన తెనాలిలో జరిగింది.
తెనాలిలో టిడిపి అభ్యర్ధి ఇంటి గోడదూకి అర్ధరాత్రి వేళ స్టేర్ కేస్ పైకెక్కి, వాటర్ ట్యాంక్ పక్క మద్యం సీసాలు పెట్టి, తప్పుడు కేసు పెట్టారు. ఎవడి ఇంట్లోకి ఎవడైనా రావచ్చా.. ఏమైనా చేయొచ్చా.. ఆ ఇంటిలో సీసీ కెమెరా పెట్టుకున్నారు కాబట్టి, బతికిపోయారు. అదే సీసీకెమెరా లేకపోతే, వాళ్ల పరిస్త్థితేంటి? అన్ని కేసులు ఇదేమాదిరి పెడుతున్నారు. రేపు ఏ ఇంట్లోకి అయినా ఇలాగే వెళతారుగా వీళ్లు... హత్యలు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు.. లూఠీలుచేయొచ్చు. దానికి సమాధానం ఏముంది?
ఎవరైతే వివేకానందరెడ్డిని చంపారో, వారిపై కేసులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, 40ఏళ్ల రాజకీయ అనుభవమున్ననన్ను చట్టపరంగా నిలువరించే ప్రయత్నం చేశారు.
మామూలుగా వీళ్లు తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఆధార్ నంబరుంటేనే లిక్కర్ అమ్ముతారు. దానికి కూడా బారో కోడింగ్, హాలోగ్రామ్ ఉంటుంది. ఏ షాపు నుంచి ఎక్కడికి వెళ్లిందో..ఎవరుకొన్నారో తెలుస్తుంది. నిన్న తెనాలిలో ఇంట్లో పెట్టిన మద్యం వారి షాపు నుంచే వచ్చిందని తెలిసింది.
ఇలాంటి తప్పుడు కేసులు కాళహస్తిలో పెట్టారు. రేపల్లెలో పెట్టారు. నిన్న చిలకలూరిపేటలో పెట్టారు. ఎక్కడైనా లిక్కర్ గానీ దొరికితే, ఆ లిక్కర్ ఎవరు కొన్నారో తెలిసేమెకానిజం ఉంది. అయినా ఏం చేశారు?
ఖాకీ టెర్రరిజం కాదా ఇది...? పోలీస్ టెర్రరిజం కాదా ఇది..?
ఆస్తులకు భద్రత ఉందా, ప్రాణాలకు భద్రత ఉందా, ఆడబిడ్డలకు భద్రత ఉందా, ప్రాణాలకు భద్రత ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ఏదో ఇష్టానుసారం చేసేసుకొని ఇప్పుడు ఆనందపడినా, భవిష్యత్ లో ప్రజలు ఛీకొట్టి, ముఖాన ఉమ్మే పరిస్థితి వస్తుంది.
వివేకానంద రెడ్డి హత్యలో ఉన్నవాళ్లను, విశాఖలో నా పర్యటన అడ్డుకున్న వైసిపి వాళ్లను ఏం చేయకుండా, నన్ను 151కింద అరెస్ట్ చేస్తారు.
బరితెగించి పుట్టపర్తి వైసిపి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టిడిపి అభ్యర్ధి ఇంటిపై దాడి చేస్తాడా..? అందరూ ఒప్పుకున్నారు.. నువ్వెందుకు ఒప్పుకోవు. నీఇష్టం అని బెదిరిస్తారా?
(పుట్టపర్తి ఎమ్మెల్యే దౌర్జన్యానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు) జగన్మోహన్ రెడ్డి ఒక నియంత. ఈయనొక నియంత. ఈ నియంతను కాపాడటానికి ఖాకీ టెర్రరిజం. ఇదేనండీ పద్ధతి, దీనికి ఎన్నికల కమిషన్ నిర్వీర్యం.
నామినేషన్ల విత్ డ్రా కు సమయం అయిపోయినా ఇప్పుడు సాయంత్రం 4గం కు కూడా విత్ డ్రా చేయాలని బెదిరిస్తారు. వినుకొండలో చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం. అన్నిచోట్ల సీసీకెమెరాలు పెట్టి, ఎన్నికలు నిర్వహించాలి. బీఫామ్స్ అన్నీ మా అడ్వకేట్స్ ద్వారా పంపిస్తాం. వీళ్లు మధ్యలో లాక్కునే ప్రమాదం కూడా ఉంది. అప్పటికీ ఏం చేస్తారో చూస్తాం.
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు.
“రాజ్యాంగం ఎంత మంచిదైనా అది అమలు చేసేవాడు మంచివాడు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది. రాజ్యాంగం మంచిది కాకపోయినా అమలు చేసేవాడు మంచివాడైతే మంచి ఫలితాలను ఇస్తుంది” అని ఆ మహానుభావుడు చెప్పడం జరిగింది. అదే ఈ రాష్ర్టంలో జరుగుతోంది.
‘‘రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం’’ ఇది. ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకోసం చేస్తున్న ఉద్యమం ఇది. ఇవి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కావని, అంతవరకే పరిమితం కాదని ప్రజలంతా తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వానికి గానీ చెక్ పెట్టకపోతే, ఇప్పటికే చాలా డామేజ్ చేశారు.. ఇంకా చేస్తారు. చివరకు అడిగే నాథుడే ఉండడు. ఉగ్రవాదులకంటే దారుణంగా తయారయ్యారు. పోలీస్ టెర్రరిజం..ఖాకీ టెర్రరిజం పెరిగిపోయింది.
వీళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే మరింత పేట్రేగిపోతారు. వీళ్లనిలాగే వదిలేస్తే ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు, మానానికి రక్షణ ఉండదు. అందుకే ప్రజలకు పిలుపునిస్తున్నా. ధైర్యంగా ముందుకుపోదాం..పోరాటంతో ముందుకెళ్లి వీళ్లని నిలువరిద్దాం. అవకాశవాదులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. డబ్బుసంచులకు అమ్ముడుపోయారు.
డబ్బులకు అమ్ముడుపోయేవారు కొందరు ఉంటే, రాజ్యాంగం పరిరక్షణ కోసం కొందరు పోరాడుతున్నారు. దారికి రానివారిపై పాతకేసులు తిరగదోడుతూ, ఆర్థికమూలాలు దెబ్బతీస్తూ నానారకాలుగా హింసిస్తున్నారు. అందుకే నేను ఒకటే కోరుతున్నా..ప్రజలు ధైర్యంగా ఉండాలి, ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలి, పిరికితనంతో పోవద్దు, ఇది ఒక్క తెలుగుదేశంపార్టీ బాధ్యతే కాదు. ఈనాడు ఎవరైతే పోటీచేస్తున్నారో, వారంతాకూడా రాజ్యాంగ పరిరక్షణకోసం పోరాడుతున్నారు. ఆ విషయం మీరంతా గుర్తుంచుకోండి. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారంతా, శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతారు.
ఈ ఉద్యమాన్ని అణిచేసేవాళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. తాత్కాలికంగా భాధలు ఉంటాయి. అందరం కలిసి సమష్టిగా పోరాడుదాం.
ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రంలో సంక్షేమాన్ని ఏవిధంగా దెబ్బతీశారో ప్రజలకు తెలియచేయడానికి ఒక పత్రాన్ని విడుదలచేస్తున్నాం.
వైసిపి ప్రభుత్వ 10నెలల పాలనలో సంక్షేమం ఏవిధంగా కుంటుపడిందో తెలియచేసే నిజపత్రం విడుదల చేస్తున్నాం. వైసీపీ వచ్చాక 35పథకాలను రద్దు చేశారు. రద్దుల పద్దులు- రివర్స్ పాలన తప్ప సాధించిందేమీ లేదు.
నేరుగా ఒక్కటే అడుగుతున్నా...
పోలీసులు పోలీసుల్లాగా ప్రవర్తిస్తున్నారా..? కోర్టులో డిజిపితో సెక్షన్ 151 చదివించిన సందర్భం ఉందా..?తాను కోర్టులో వేసిన అఫిడవిట్ తప్పిన ఒప్పుకున్న డీజీపీ రాష్ట్రంలో తప్ప, ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? తప్పు అయ్యిందని కోర్టులో ఒప్పుకోలేదా డిజీపీ..? సామాన్య ప్రజానీకం పోలీసుల వద్దకు వచ్చేపరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయా? డీజీపీకి విశ్వసనీయత ఉందా? అందుకే పోలీస్ టెర్రిరిజం అంటున్నా. ఈ రాష్ట్రం సర్వనాశనానికి కంకణం కట్టుకున్నారు. దీన్ని పరిరక్షించడానికి మేం ఉద్యమిస్తున్నాం.
మీ సబార్డినేట్స్ ను కట్టడి చేయండి. హద్దుమీరిన వాళ్లను నియంత్రించండి. ప్రజలకు రక్షణగా నిలవండి, ఒకవ్యక్తికి ఊడిగం చేయడం కాదు.. కోర్టులో కూడా అదేచెప్పారు. శాశ్వతంగా లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేయాలి. కథలు చెప్పడం మాని, ఇప్పటికైనా పనిచేయండి. అడిగేవాళ్లు లేరని తమాషాలు ఆడతారా? పోలీసులు ఇదేవిధంగా వ్యవహరిస్తే, ఆనాడు సిపాయిల తిరుగుబాటు ఎలా వచ్చిందో, అలాంటి పరిస్థితే వస్తుంది.