17.03.2020
పంచుమర్తి అనురాధ మీడియా సమావేశం వివరాలు
రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదు
స్పీకర్ గా తమ్మనేని సీతారాంకు అర్హత లేదు
వైసీపీ కార్యకర్తలాగా స్పీకర్
వైసీపీ మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు
ఈ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి
• వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10నెలలు అవుతోంది. కానీ ఏ రోజు కూడా ప్రజా ఆరోగ్యం పట్టించుకోలేదు.
• ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు గారు అనేక సార్లు ప్రజా ఆరోగ్యం గురించి ఎన్ని సార్లు మాట్లాడిన కూడా ఈ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యహారించింది.
• దాదాపు 10నెలల కాలంలో 24,500 మంది మలేరియా వలన చనిపోయారు.
• 4300మంది డెంగ్యూ జర్వం వలన చనిపోయారు.
• డెంగ్యూ జర్వం వలన భార్య చనిపోవడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు.
• పెళ్లి కూతురు కూడా డెంగ్యూ జర్వం వలన చనిపోవడం జరిగింది.
• అలాగే పులివెందులలో త్రిబుల్ ఐటీ లో 300మంది విద్యార్ధులు డెంగ్యూ జర్వంతో బాధపడుతుంటే ఈ ప్రభుత్వం స్పందించలేదు.
• ఈ రోజు కూడా అదే పరిస్థితి.. కరోనా జాతీయ విపత్తుని ప్రధానిమంత్రి ప్రకటించిన కూడా ఈ ప్రభుత్వం స్పదించడం లేదు.
• ఎన్నికల వాయిదాపై మంత్రులు బాధ్యతరహితంగా మాట్లాడుతున్నారు.
• ఎడ్యుకేషన్ మినిష్టర్ ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ పెట్టి స్కూల్స్, యూనివర్శటీలు మూసివేస్తున్నాం. కరోనా గురించి డ్యూస్..డ్యూనాట్ చెప్పడం మాని నిసిగ్గుగా మాట్లాడుతున్నారు.
• స్పీకర్ తమ్మినేని సీతారాం గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న పదవులన్ని కూడా రెడ్డలకేనా అని మాట్లాడారు..
• ఇవాళ కమ్మ సామాజిక వర్గమని, కమ్మ వైరస్ అని మాట్లాడుతున్నారు.
• ఏ గూడు పక్షి ఆ గూడు పాట పాడుతుంది.
• బాధ్యతాయుత పదవులో ఉన్న తమ్మినేని సీతా రాం వైసీపీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నారు.
• తమ్మినేని సీతారాం స్పీకర్ పదవికి అర్హత లేదు.
• జగన్మోహన్ రెడ్డి పోలీసులను మా పోలీలని పోగుడుతున్నారు.
• విలేకర్లపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టినందుకు పోగుడుతున్నారా?
• నామినేషన్ వేయకుండా రవిక లోపల పత్రాలను లాక్కున్నందుకు పోగుడుతున్నారా?
• టీడీపీ నాయకులను పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ల వేయకుండా బెదిరించినందుకుపోగుడుతున్నారా?
• మా నాయకులు బుద్దా వెంకన్న, బోండా ఉమాపై మాచర్లలో పోలీసుల సహాయంతో హత్యాయత్నం చేసినందుకు పోలీసులను పోడుగుతున్నారా?
• స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆంధ్రపదేశ్ లో పోలీసులకు న్యాయస్థానాలు చీవాట్లు పెట్టిన సంధర్భం లేదు.
• డీజీపీని హైకోర్టులో ఉదయం 10గంటల నుంచి 5:30 నిమిషాలకు వరకు నిలబడినందకు పోగుడుతున్నారు.
• రాష్ర్టంలో ఉంది ఇండియన్ పోలీసు సర్వీసా లేక జగన్ పోలీసు సర్వీసా? ఐపీఎస్ ఆ...జేపీఎస్ ఆ?
• కరోనా పై ఇంత వరకు స్పదించకపోవడంతో రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వం లేదని అనుకుంటున్నారు.
• ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కులాల గురించి మాట్లాడుతున్నారు.
• ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ప్రజల మనోభావాల గురించి అలోచించాలి.
• వరదలు, ఇసుక కోరత వలన 40 మంది చనిపోతే సీఎం మీడియా సమావేశం పెట్టలేదు.
• ధ్యానం కోనుగోలు బాకాయిలు రూ.2వేల కోట్లు గురించి ప్రెస్ మీడియా పెట్టలేదు.
• రాజధాని ప్రాంతంలో దాదాపు 2500మంది మహిళలపై అక్రమ కేసులు పెట్టితే కనీసం స్పదించని మీరు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ విమర్శించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు.
• రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఈ రోజులు తెలిపోయింది.
• రాజ్యంగం పట్ల గౌరవం లేని వ్యక్తికి ముఖ్యమంత్రిగా ఉంటే అర్హత లేదు.
• ఈ రాష్ట్రానికి అభివృద్ధి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే వెంటనే ఈ ప్రభుత్వానికి రద్దు చేయాలి.
ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి