గవర్నర్‌తో భేటీ కానున్న చంద్రబాబు

గవర్నర్‌తో భేటీ కానున్న చంద్రబాబు
అధికార వైసీపీ నేతల దౌర్జన్యాలపై గవర్నర్‌కు  ఓ వినతిపత్రం ఇవ్వనున్న  చంద్రబాబు


అమరావతి : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ నేతల దౌర్జన్యాలపై గవర్నర్‌కు చంద్రబాబు ఓ వినతిపత్రం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన బుధవారం తీవ్ర హింసాకాండ చెలరేగింది. టీడీపీ అభ్యర్థులపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి.


అంతేకాకుండా నామినేషన్ పత్రాలను లాక్కొని చించేశారు. అంతకాకుండా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై వైసీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. సుమారు 30 కిలోమీటర్లు వెంటాడి అవకాశం దొరికిన  చోటా రాళ్లు, కర్రలతో దాడి చేశారు. పట్టణ వైసీపీ యువనేత తురకా కిశోర్ స్వయంగా పెద్ద కర్రతో వాహనం అద్దాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటిని కూడా చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ బృందం గవర్నర్ హరిచందన్‌కు సాక్ష్యాలతో సహా వివరించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.