జగన్ తలుచుకుంటే చంద్రబాబుకు : పెద్దిరెడ్డి
అమరావతి : కరోనా సాకుతో స్థానిక ఎన్నికలు వాయిదా సరికాదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఏపీలో ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదైందన్నారు. చంద్రబాబు 3లక్షల కోట్లు అప్పు చేశారు. 60వేల కోట్లు బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు రాకుండా చంద్రబాబు మోకాలడ్డుతున్నారని విమర్శించారు. తను నియమించుకున్న ఎస్‌ఈసీతో ఎన్నికలను వాయిదా వేయించారని మంత్రి అన్నారు. స్థానిక ఎన్నికలు జరిగితే రాష్ట్రానికి రూ.5 వేల కోట్లు వస్తాయని పేర్కొన్నారు. నోటిఫికేషన్ కూడా ఇవ్వని మహారాష్ట్రలో వాయిదా వేశారనడంలో అర్ధం లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో ఏదో జరిగిపోయిందని చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎక్కడా ఒక్క కేసు అయినా నమోదైందా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. బ్లాక్‌క్యాట్ సెక్యూరిటీలో ఉన్న చంద్రబాబు ఇంకా సీఎంనని భావిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ తలుచుకుంటే చంద్రబాబుకు విపక్షనేత హోదా కూడా ఉండదన్నారు. చంద్రబాబు, ఎస్‌ఈసీ రమేష్ ఒకే యూనివర్సిటీలో చదువుకున్నారని తెలిపారు. రమేష్‌కు ఉద్యోగంలో కూడా చంద్రబాబు సాయం చేశారని ఆరోపించారు.
జగన్ తలుచుకుంటే చంద్రబాబుకు : పెద్దిరెడ్డి