సీఎం జగన్‌ రాజీనామా తప్పదు: దేవినేని ఉమ

సీఎం జగన్‌ రాజీనామా తప్పదు: దేవినేని ఉమ
గుంటూరు :  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. జగన్‌.. నవ మాసాల్లో నవ మోసాలు చేశాడని ఆరోపించారు. రాజధాని గ్రామాల్లో ఎన్నికలు వాయిదా వేయడం అంటే ప్రభుత్వం భయపడిందని అర్థమవుతోందని దేవినేని ఉమ అన్నారు. వైసీపీ అభ్యర్థుల్ని 90 శాతానికి పైగా గెలిపించుకోకపోతే మంత్రులంతా రాజీనామా చేయాలని జగన్‌ చెప్పారని గుర్తు చేశారు. ఓటర్లంతా టీడీపీకి ఓటేస్తే జగన్‌ మార్చి చివరి నాటికి రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేస్తారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. రాజ్యసభ సీటు రూ.200 కోట్లకు బయటి రాష్ట్రం వ్యక్తికి ఇచ్చారని ఆరోపించారు. గతంలో వైఎస్‌ మరణానికి కారకులని అనుమానించి.. ఇప్పుడు రిలయన్స్‌ చెప్పిన వ్యక్తికే ఎలా ఇస్తారు? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.