నేతలపై పోలీస్‌ అధికారుల సంఘం ఆగ్రహం

నేతలపై పోలీస్‌ అధికారుల సంఘం ఆగ్రహం
గుంటూరు : టీడీపీ నేతలపై పోలీస్‌ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాచర్ల ఘటన విషయంలో పోలీసులు, జగన్ సర్కార్‌పై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో తాజాగా పోలీసుల సంఘం రియాక్ట్ అయ్యింది.
మీపై కేసులు పెట్టడానికి వెనుకాడం!
‘ ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని బోండా ఉమ, బుద్దా వెంకన్న అబద్ధాలు చెబుతున్నారు. దాడి సమాచారం రాగానే డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ నేతలను కాపాడారు. మా ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడాం. ప్రాణాలు కాపాడిన పోలీసులనే నిందించడం బాధ కలిగించింది. రిపోర్ట్‌ ఇవ్వమంటే బాధితులు ఇవ్వలేదు. సుమోటోగా కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. మీపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడం’ అని టీడీపీ నేతలపై పోలీస్‌ అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది.