*విజయవాడ*
పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు ను కలిసిన టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ
*బోండా ఉమ*
రాష్ట్రం లో రౌడీ రాజ్యం కొనసాగుతుంది
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి అరాచకాలకు పాల్పడుతుంది
టిడిపి అభ్యర్థుల నామినేషన్లు లాక్కుని చించేస్తున్నారు
నిన్న జరిగిన దాడి ఘటన. ప్రజలు అందరూ చూశారు
మమ్మలను చంపాలని మూడు చోట్ల ప్రయత్నం చేశారు
అదృష్టవశాత్తు నేను, బుద్దా వెంకన్న ప్రాణాలతో బయటపడ్డాం
ప్రభుత్వం తన సొంతానికి పోలీసు వ్యవస్థ ను వాడుకుంటుంది
మాజీ సిఎం చంద్రబాబు వచ్చినా డిజిపి అపాయింట్మెంట్ ఇవ్వాలేదు
అడిషనల్ డిజి కి అన్నీ వివరించాం.. అయినా విచారణ జరగలేదు
మొక్కుబడిగా కేసులు పెట్టి.. చేతులు దులుపుకున్నారు
చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ లను రాజకీయాల్లో లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నారు
పోలీసులు కు మేము సమాచారం ఇచ్చి బయలు దేరాం
వారి నుంచి పిన్నెల్లి వర్గాలని సమాచారం వెళ్లింది.. అందుకే వారు పధకం ప్రకారం దాడి చేశారు
హైకోర్టు న్యాయవాది తీవ్రంగా గాయపడి.. పరిస్థితి విషమంగా ఉంది
ఇప్పటికే డిజిపి కి అన్ని విషయాలు తెలియ చేసినా స్పందన లేదు
పోలీసులు పై నమ్మకం మాకు లేదు.. పోలీసులే సమాచారం వైసిపికి నాయకులకు చేర వేస్తున్నారు
చంద్రబాబు తో సహా అందరు టిడిపి నేతల ఫోన్ లు ట్యాపింగ్ లో ఉన్నాయి
ఈ హక్కు ఎవరిచ్చారు.. ఇంతకంటే చంపేయండి.. రేపు అయినా చంపాలని చూస్తున్నారు
సిపి ని కలిసి మరోమారు అన్ని విషయాలు వివరించాం
సాయంత్రం గవర్నర్ ను కలిసి ప్రభుత్వం అరాచకాల పై ఫిర్యాదు చేస్తాం
చెక్ పోస్ట్ లు పెట్టి అక్రమాలు నియంత్రించడంలో ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి
మాకు బెదిరింపులు, ఫోన్లు అనేకం వస్తున్నాయి
మీడియా కూడా ఉన్నవి ఉన్నట్లుగా కధనాలు ఇవ్వాలి
మాకు ఎఏం జరిగినా పోలీసు వ్యవస్థ బాధ్యత వహించాలి
మేము మాచర్ల పోలీస్టేషన్ కే వెళ్లాం.. ప్రచారానికి కాదు
మా పై హత్యాయత్నం స్కెచ్ మొత్తం తాడేపల్లి కార్యాలయం నుంచే జరిగింది
2017లో ప్రమాదం ఫొటో పెట్టి.. ఇప్పుడు జరిగినట్లు చూపిస్తున్నారు
మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం
ఎవరెవరికో ప్రభుత్వం గన్ మెన్లను ఇచ్చింది.. మాకు కూడా ఇప్పచాలని కోరుతున్నాం