క్యాన్సర్ తో పోరాడుతున్న రోగి ఆయుర్థాయాన్ని పెంచడమే కాకుండా
కణితిని తొలగించే సమయంలో అవయవాలను పరిరక్షించి అంగవైకల్యం నుండి కాపాడేలా ఇరువురు చిన్నారులకు నవ్యాంధ్ర ప్రదేశ్ లోనే మొదటి సారిగా అరుదైన క్లిష్టమైన శస్త్రచికిత్స ను విజయవంతంగా నిర్వహించిన ఓమెగా హాస్పిటల్స్, గుంటూరు వైద్య బృందం
క్యాన్సర్ తో భాదపడుతున్న ఇరువురు చిన్నారులు ఓమెగా హాస్పిటల్స్ లో చికిత్సకై సంప్రదించడం జరిగింది. వీరికి జరిపిన వ్యాధి నిర్థారణ పరీక్షలలో భాగంగా కాలి భాగంలో క్యాన్సర్ వ్యాధి సోకిన కణితులను గుర్తించారు. ఇలా ఏర్పడిన క్యాన్సర్ సోకిన కాలి భాగాలను తొలగించక తప్పదని నిర్థారించుకొన్న వైద్యులు అయితే వాటిని తొలగించిన తర్వాత చిన్నారులు వికలాంగులుగా మారకుండా చూడాలని తీర్మానించి అందుకు ప్రస్థుతం ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న 3 డి ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా తీసి వేస్తున్న అవయవ భాగాలను తయారు చేసి వాటిని అమర్చాలని నిర్ణయించారు. ఇలా ఎంతో అరుదైన మరియు క్లిష్టమైన శస్త్ర చికిత్సను నవ్యాంద్ర ప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మొదటి సారిగా నిర్వహించడానికి ఓమెగా హాస్పిటల్స్ కు సర్జీకల్ ఆంకాలజిస్టు డా. యంజి నాగకిషోర్ మరియు ప్రముఖ ఎముకల శస్త్ర చికిత్స నిపుణులు డా. వి కోటేశ్వర ప్రసాద్ నేతృత్వంలోని వైద్య బృందం నిర్ణయించి ఫిబ్రవరి 12 మరియు 17 తేదీలలో చిన్నారులకు విజయవంతంగా ఆపరేషన్ ను పూర్తి చేశారు. షుమారు 7 గంటల పాటూ నిర్వహించిన ఈ శస్త్ర చికిత్సలో క్యాన్సర్ సోకిన భాగాన్ని పూర్తిగా తొలగించడమే కాకుండా తొలగించిన అవయవ భాగ స్థానంలో 3డి ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన కృత్రిమ అవయాన్ని అమర్చారు. ఈ అరుదైన అవయవ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైన సందర్భంలో ఓమెగా హాస్పిటల్ వైద్య బృందం ప్రత్యేకమైన విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ముందుగా ఓమెగా హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా. యంజి నాగకిషోర్ మాట్లాడుతూ ఎంతో క్లిష్టమైన ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తద్వారా క్యాన్సర్ తో పోరాడుతున్న భాదితురాలి జీవన కాలాన్ని పెంచగలిగామని సంతృప్తి వ్యక్తం చేస్తూ ఓమెగా హాస్పిటల్స్ గుంటూరు లో అందుబాటులోనికి తీసుకొని వచ్చిన అత్యాధునిక వైద్య విధానాలు, పరికాల కారణంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. భవిష్యత్తులోనూ క్యాన్సర్ చికిత్సలో వచ్చే ఆధునిక ప్రక్రియలను నవ్యాంద్ర ప్రదేశ్ లోని పేషెంట్లకు అందించడంలో ఓమెగా ముందుంటుందని పేర్కొన్నారు.
అనంతరం ప్రముఖ ఎముకల వైద్య నిపుములు డా. వి కోటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ నేటి ఆధునిక వైద్య శాస్త్రంలో అందుబాటులోనికి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన 3 డి ప్రింటింగ్ టెక్నాలజీ వంటి వాటి ద్వారా కోల్పోయిన అవయవాలను ఖచ్చితమైన రీతిలో తిరిగి తయారు చేయడమే కాకుండా వాటిని తిరిగి అమర్చి తద్వారా రోగులు అంగవైకల్యానికి గురి కాకుండా నివారించవచ్చని వివరించారు. ముఖ్యంగా చిన్న పిల్లలలో అంగవైకల్యాన్ని నివారించడం ఎంతో అవసరమని తద్వారా వారి పూర్తి జీవితాన్ని సాఫీగా గడిపేలా చూడవచ్చని ఆయన అన్నారు.
చివరగా విలేఖరుల సమావేశంలో చిన్నారుల తల్లి తండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలను రోగ విముక్తులు చేయడమే కాకుండా అంగవైకల్యం నుండి వారిని రక్షించి వారి భవిష్యత్తును కాపాడిన ఓమెగా హాస్పిటల్ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇలా ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విలేఖరుల సమావేశంలో డా. యంజి నాగకిషోర్ తో పాటూ ఓమెగా హాస్పిటల్ వైద్య బృందం, రోగి బంధువులు తదితరులు పాల్గొన్నారు.