*18–03–2020*
*అమరావతి*
సచివాలయంలో 210వ రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్.ఎల్.బీ.సీ)
సమావేశం
:ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్:
కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకులు మరింత ముందుకురావాలి:
ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవు:
వైయస్సార్ నవోదయం పధకం కింది ఎంఎస్‌ఎంఈలకు, ప్రధానమంత్రి ముద్రయోజన కింద ఇచ్చే రుణాలు, ఎస్సీ,ఎస్టీ, మహిళలకిచ్చే రుణాల శాతం చాలా తక్కువగా ఉంది:
స్వయం సహాయక సంఘాల రుణాలపై కూడా దృష్టి పెట్టాలి:
మహిళలకు వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్ఫధంతో ఉండాలి:
రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ ఒకటిలో ఉన్న 6 జిల్లాల్లో ఒకలా, మిగిలిన 7 జిల్లాలో ఇంకోలా వడ్డీరేట్లుఉన్నాయి:
బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయి:
12.5 శాతం, 13.5 శాతం ఇలా వసూలు చేసుకుంటూ పోతున్నారు:
వడ్డీరేట్ల విషయలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలి:
మరోవైపు ప్రభుత్వం తరఫున సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బ్యాంకులు ఈ స్థాయిలో వడ్డీలు వేయడం ఆలోచించదగ్గ విషయం:
వైయస్సార్ కడప జిల్లా మాదిరిగానే బ్యాంకుల డిజిటలైజేషన్ ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ అమలుచేయాలి
గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నాం:
గ్రామాల ఆర్థిక వ్యస్థలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం:
గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలపై ఆధారపడే పరిస్థితులను తగ్గిస్తున్నాం:
గ్రామ సచివాలయలు, విలేజ్ క్లినిక్కులు, ఇంగ్లిషు మీడియంలో బోధించే పాఠశాల, రైతు భరోసా కేంద్రాలతో గ్రామాలలో విప్లవాత్మకంగా మార్పులు తీసుకు వస్తున్నాం:
గ్రామ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉన్నారు:
ఆర్‌బీకే(రైతు భరోసా కేంద్రం) లో ఇంటర్నెట్ కియోస్క్ అందుబాటులో ఉంటుంది:
ఈ కియోస్క్‌ద్వారా తమకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఆర్డర్ చేస్తే నాణ్యతా నిర్దారణలతో అవి రైతులకు అందుబాటులోకి వస్తాయి:
అలాగే ఈ– పంటలో విలేజ్ అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లతో వివరాలు నమోదు చేయిస్తున్నాం:
దీనికోసం వీరందరికీ కూడా ట్యాబులు ఇస్తున్నాం:
ఈ వివరాలను బ్యాంకులతో అనుసంధానం చేస్తాం:
డిమాండు సప్లయిలను పరిగణలోకి తీసుకుని ఏ పంటలు వేయాలన్నదానిపై రైతుకు ఆర్బేకేల ద్వారా సూచనలు చేస్తాం:
ఈ– పంటలో నమోదైన వివరాల ఆధారంగా సాగుచేస్తున్న పంటలకు తగినట్టుగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది:
అలాగే కౌలు రైతులు సాగుచేస్తున్న పంట వివరాలు అందుబాటులో ఉంటాయి
రెవెన్యూ అసిస్టెంట్లు ద్వారా కౌలు రైతు, యజమాని ఇద్దరూ అగ్రిమెంటు మీద సంతకం చేసి బ్యాంకు రుణం కోసం ఇస్తారు :
బ్యాంకులు వారికి ఉదారంగా రుణాలు ఇవ్వాలి:
రైతులకు పండించిన పంటకు తగిన ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం:
తాను ఆశించిన ధర రాకపోతే రైతులు ఆర్బీకే ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తారు
ధర రాని పక్షంలో ప్రభుత్వం జోక్యంచేసుకుని మార్కెట్లో పోటీని పెంచేలా, రైతులకు కనీస గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటుంది:
మే 15న ఆర్బీకే ద్వారా రైతు భరోసా ఇవ్వబోతున్నాం
మైక్రోఎంటర్ ప్రైజెస్ కోసం జూన్‌లో ఓ పథకాన్ని ప్రారంభించబోతున్నాం: గుర్తింపు కార్డులతో రూ. 10వేలు చొప్పున వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నది ఆలోచన
చిరు వ్యాపారులు, తోపుడు బళ్లమీద చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు:
ఇది వాళ్లకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది:
మాకు కొన్ని కలలు, ఆకాంక్షలు ఉన్నాయి:
వాటిని నెరవేర్చడానికి మీ సహకారం చాలా అవసరం:
కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టింది:
రాయలసీమ కరువు నివారణా చర్యల్లో భాగంగా వరదజలాలను తీసుకెళ్లే కాల్వలను విస్తరిస్తున్నాం:
ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం వరకు నీరు పోవాలి:
దివంగత నేత వైయస్సార్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది:
వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి సరఫరా అందించాలి
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వా కల్చర్ వల్ల నీరు కలుషితం అవుతుంది:
శ్రీకాకుళంలోని కిడ్నీ బాధితులు సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని ప్రజలకు వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని అందించడానికి ముందడుగు వేస్తున్నాం:
ఈ కార్యక్రమాలన్నింటికీ మీ సహకారం కావాలి: సీఎం వైయస్.జగన్
*210వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో నిర్దేశించుకున్న రుణాలు, ప్రగతిని వివరించిన ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ జె.పకీరసామి*
5వేల జనాభాకు పైబడిన 567 చోట్ల సీబీఎస్ బ్యాకింగ్ సర్వీసులు ప్రారంభించాం: జె.పకీర సామి
5 కి.మీ పరిధిలో బ్యాంకింగ్ సదుపాయంలేని 229 గ్రామాలను మ్యాపింగ్ చేశాం:
ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 29 మధ్య జరిగిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా 1.1 లక్షలమంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాం:
ఏడాదిలోగా వైయస్సార్ కడప జిల్లాలో వందశాతం డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయం:
ప్రభుత్వం ప్రారంభిస్తున్న 1౧వేలకుపైగా రైతు భరోసా కేంద్రాల్లో బ్యాకింగ్ సదుపాయం తీసుకువచ్చేలా, బ్యాంకు మిత్రలను ఆయా కేంద్రాల్లో ఉంచడానికి చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లందరికీ విజ్ఞప్తిచేస్తున్నాం:
వైయస్సార్ నవోదయం పథకం ద్వారా సమస్యలు ఎదుక్కొంటున్న ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలవాలి:
ప్రాథమిక రంగానికి నిర్దేశించుకున్న రుణ పంపిణీ లక్ష్యం రూ. 1,69,200 కోట్లకు గాను డిసెంబరు నాటికి రూ. 1,18,464 కోట్లు ఇచ్చాం:
ఇది 70.01 శాతంగా ఉంది:
వ్యవసాయ రంగంలో నిర్దేశించుకున్న రూ.1,15,000 కోట్లకు గాను డిసెంబరు నాటికి రూ.83,444 కోట్లు (72.56శాతం) రుణాలుగా ఇచ్చాం:
కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు దృష్టి సారించాలి:
2019 వార్షి రుణ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యం రూ. 2,29,200 కోట్లు కాగా, డిసెంబరు వరకూ రూ. 1,73,625 కోట్లు (75.75శాతం) ఇచ్చాం:
ఎంఎస్‌ఎంఈలకు రూ.36,000 వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యం కాగా డిసెంబరు వరకూ రూ. 29, 442 కోట్లు (81.78శాతం)ఇచ్చాం:
ఎస్సీ, ఎస్టీ మహిళలకు స్టాండప్ ఇండియా కింద ఆర్థిక సహాయం చేయాలని లక్ష్యం చేసుకోగా డిసెంబరు వరకూ రూ. 4,857 మందికి సహాయం చేశాం:
ఎస్‌ఎల్‌బీసీ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్,
పాల్గొన్న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఎస్.ఎస్.రావత్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, కె పకీరిసామి, ప్రెసిడెంట్ (ఎస్‌ఎల్‌బీసీ), కే వి నాంచారయ్య, కన్వీనర్, ఎస్‌ఎల్‌బీసీ, సీజీఎం(ఆంధ్రా బ్యాంకు), ఆర్బీఐ జనరల్‌మేనేజర్ సుందరం శంకర్, నాబార్డ్ సీజీఎం ఎస్.సెల్వరాజ్.