ఏపీలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత

ఏపీలో ఆర్టీసీ బస్సుల నిలిపివేత
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనానై ప్రధాని పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఈ అర్ధరాత్రి నుంచే నిలిపివేయనున్నట్టు చెప్పారు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు.