*శ్రీకాకుళం*
*ఏపీ రాష్ట్ర టీడీపి అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు కామెంట్స్....*
ఎన్నికల కమీషనర్ పై ముఖ్యమంత్రి గారు అనుచితంగ మాట్లాడటం చాలా బాధాకరం.
పులివెందుల రాజకీయం చేస్తున్నారు.
ఎన్నికల కమిషనర్ పై ముఖ్యమంత్రి గా మీ కామెంట్స్ సభ్యసమాజం ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది
మీరు ముఖ్యమంత్రి గా బ్లాక్ మెయిల్ చేస్తారా..?
రాజ్యాంగం ప్రకారం వ్యవస్థ నడవకూడదా.?
ప్రభుత్వ అధికారులందరు. మీరు చెప్పినట్లే నడవలా?
ఐఏఎస్,ఐపీఎస్ అధికారులకు రూల్స్ ఉంటాయి వాటి ప్రకారం నడుచుకోవాలి అని రాజ్యాంగం చెబుతుంది.
కమిషనర్ పై మీరు వాడే భాష గాని సామాజిక వర్గం పై మీరు మాట్లడే తీరు చాలా బాధాకరం
మీరు చెప్పినట్లు చేయనటువంటి ప్రభుత్వ అధికారుల పై మరియు 248 ఎమ్మార్వో ఆఫీసుల పై ఏసీబీ దాడులు చేయించడం నిజం కాదా ..?
నామినేషన్ వేయకూడదంటే వేయకూడదు. మానేయాలి అని మనేయాలి .లేదా ? చింపేయాలి అని మీ అనుచరులు కు చెప్పలేదా. ?
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గా కులాలు గురించి మాట్లాడవచ్చా..?
గత ముఖ్యమంత్రి లు కులాలు కోసం మాట్లాడం మీరు చూసారా. ?
32 సంవత్సరాలుగా ఒక ఎలక్షన్ కమిషనర్ పై ఇటువంటి పదజాలం వాడటం మేము చూడలేదు.
మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టినప్పటినుండి కులాలు మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పాలిస్తున్నారు.
మీ స్వార్థం కోసం కులాలు మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదు.
ఇటువంటివి ఒక ముఖ్యమంత్రి గా మీకు తగునా?
తెలంగాణ లో 63 సంవత్సరాలుకు మీలాంటి స్వార్ధ పరులు కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రెండు రాష్ట్రాలుగా విడగొట్టేలా చేశారు.
151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పులివిందల పంచాయితీ చేస్తే ప్రజలు ఒప్పుకుంటారా..?
ప్రభుత్వ పరిపాలన అంత నా కాలి కింద పెట్టుకుంటానంటే ప్రజలు సహించరు మేము చూస్తూ ఊరుకోము.
కరోనా గురించి మీరు మాట్లాడినది చాలా తక్కువ.
ప్రాణం కోసం విలువ లేకుండా నిర్ణిత వయస్సు వారు మాత్రమే చనిపోతారని చెప్పడం చాలా బాధాకరం.
ఎలక్షన్ ఆగిపోయిందని బాధ తప్పా.. కరోనా గురించి మీకు తెలియదా.?
ప్రపంచమంతా ఈ విషయం కోసమే మాట్లాడుతుంటే మీకు పట్టదా
ఈ కరోనా కోసం ఐపిల్ తో సహా మ్యాచ్ లు ఆపిస్తే రాష్ట్రంలో కరోనా పరిస్థితి ఎలా ఉందో వివరణ ఇచ్చారా..
సుమారు 254 మంది పైగా మీ నాయకులు వున్నారు వారి కాల్ డేటా పరిశీలించండి.
ఎటువంటి ప్రలోభాలు పెట్టారో. మీకే తెలుస్తుంది
మీరు చేసిన తప్పులను కప్పిపుచ్ఛికోవడానికి కమీషనర్ మీద పడతారా... ?
కులం గురించి మాట్లాడుతున్నారు.
నామినేషన్ల పత్రాలు పోయాయంట ఏమైనా అంటే పాత కేసులు తీస్తున్నారు.
కరోనా కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు ఖర్చు పెడతామన్నారు.
కానీ మీరు మాంత్రం పేరాసిట మాల్ మాత్ర వేసుకుంటే సరిపోతుందని అంటున్నారు.
ప్రజల ప్రాణాలు అంటే మన ముఖ్యమంత్రి కి పట్టదా...?
ముఖ్యమంత్రి గా మీరు చేసిన తప్పు తెలుసుకొని ఏలక్షన్ కమిసినర్ కు వాళ్ళ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలి ..