బీసీలను అణగదొక్కేందుకు కుట్ర: కాల్వ శ్రీనివాసులు
అనంతపురం : టీడీపీకి అనుకూలంగా ఉన్నారని బీసీలను అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. బీసీల రిజర్వేషన్ 34 నుంచి 24 శాతానికి తగ్గించడం దారుణమన్నారు. సుప్రీంకోర్టులో పస లేని వాదనలతోనే బీసీలు రిజర్వేషన్స్ కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు యువత ముందుకు రావాలని కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.
బీసీలను అణగదొక్కేందుకు కుట్ర: కాల్వ శ్రీనివాసులు