గవర్నర్‌ను కలిసిన పీసీసీ చీఫ్ శైలజానాథ్

గవర్నర్‌ను కలిసిన పీసీసీ చీఫ్ శైలజానాథ్
విజయవాడ : రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ దాష్టీకాలను గవర్నర్‌కు వివరించామని చెప్పారు. ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకుంటోందని, అధికార పార్టీకి అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. పోలీసుల దగ్గర నుంచి వెరిఫికేషన్‌ సర్టిఫికెట్లు తేవాలనడం హాస్యాస్పదమన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగడంలేదని, రద్దు చేయాలని కోరామని చెప్పారు. ఎన్నికలు రద్దు చేసి తగిన సమయంతో నోటిఫికేషన్‌ ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.