సమిష్టి పోరుతోనే కరోనాపై విజయం :ఆంధ్రప్రదేశ్ గవర్నర్

సమిష్టి పోరుతోనే కరోనాపై విజయం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్


విజయవాడ, మార్చి 20: కరోనావైరస్ (కొవిడ్19) వ్యాప్తిని నిరోధించే క్రమంలో వైద్య నిపుణులు సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు తమ నివాసాలలోనే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను విరమించుకోవాలని గవర్నర్ సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలను కలిగిన ఏవరైనా తమ చేతులను పారిశుధ్య ద్రావకంతో (శానిటైజర్) తరచుగా శుభ్రం చేసుకోవాలని,  ముసుగుతో ముఖాన్ని కప్పి ఉంచుకోవాలని పేర్కొన్నారు. వ్యక్తుల మధ్య సామాజిక దూరం అత్యావశ్యకమైన అంశమన్న గవర్నర్,  పది మందికి పైగా గుమికూడకుండా ఉండాలని, తమ నివాసాలలోని వృద్దుల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.  కరోనా లక్షణాలు కనిపిస్తే, భయపడకుండా కాల్ సెంటర్‌ను సంప్రదించి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లోని వైద్యుల సలహా మేరకు వ్యవహరించాలన్నారు. సాధారణ స్ధితికి పరిస్థితి చేరే వరకు ఎప్పటికప్పుడు అధికారుల సలహాను అనుసరించి వ్యవహరించాలని, రద్దీగా ఉండే మత పరమైనర ప్రదేశాలను సందర్శించకుండా ఉండాలని బిశ్వ భూషణ్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.  అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటమే కాకుండా సమిష్టి పోరాటం ద్వారానే కరోనావైరస్ కు వ్యతిరేకంగా సాగుతున్న యుద్ధంలో విజయం సాధించ గలుగుతామని  గౌరవ హరిచందన్ పేర్కొన్నారు. మన కుటుంబాలను, సమాజాన్ని, దేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ కదిలి రావలసిన అవసరం ఉందన్నారు. ప్రధాని పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ కు సిద్దంగా ఉండాలని బిశ్వ భూషణ్ అకాంక్షించారు.


కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ ప్రవేశంపై ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నట్లు గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు ఉద్యోగులతో సహా రాజ్ భవన్ లో ప్రవేశించే ప్రతి ఒక్కరినీ భద్రతా సిబ్బంది థర్మల్ , నాన్-టచ్ ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ల ద్వారా స్కానింగ్  చేస్తున్నారని తెలిపారు. రాజ్ భవన్ అధికారులు, సిబ్బందికి శానిటైజర్స్, ముసుగులు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. అధిక ఉష్ణోగ్రత, ఫ్లూ వంటి లక్షణాలతో కనిపించే వారు తక్షణమే వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకోవలసి ఉంటుందన్నారు. అధికారులు, ఉద్యోగులు వారి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, జ్వరం, జలుబు లక్షణాలతో అనారోగ్యంగా ఉంటే వారికి తక్షణమే సెలవు మంజూరు చేసేలా అదేశించామన్నారు. మరోవైపు ప్రజలతో  ప్రత్యక్ష సంబంధాలను వాయిదా వేసేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సైతం ఈ నెలాఖరు వరకు తన పర్యటనలను రద్దు చేసుకున్నారని, రాజ్యాంగ బద్ద మైన వ్యవస్ధలకు చెందిన వారిని మినహా, దశల వారిగా సందర్శకుల ప్రవేశంపై కూడా అంక్షలు అమలు చేయనున్నామని మీనా తెలిపారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image