కరోనా నేపథ్యంలో మాస్కులు తయారుచేస్తున్న ఇస్రో

కరోనా నేపథ్యంలో మాస్కులు తయారుచేస్తున్న ఇస్రో
ఇప్పటికే 1000 లీటర్ల శానిటైజర్ల ఉత్పత్తి
సులువుగా వాడే వెంటిలేటర్ రూపకల్పన
తయారీ బాధ్యతను పారిశ్రామిక సంస్థలే తీసుకోవాలన్న ఇస్రో
కరోనా భూతాన్ని ఎదుర్కోవడంలో దేశం మొత్తం ఏకతాటిపైకి వస్తోంది. తాజాగా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా కరోనా వైరస్ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించింది. దీనిపై ఇస్రో డైరెక్టర్ ఎస్.సోమ్ నాథ్ మీడియాతో మాట్లాడారు. తమ  అధీనంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సులువుగా ఉపయోగించగల వెంటిలేటర్ ను డిజైన్ చేస్తుందని, దాని తయారీ బాధ్యతను ఇతర పారిశ్రామిక సంస్థలే స్వీకరించాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు తాము 1000 లీటర్ల శానిటైజర్లను తయారు చేశామని, ప్రస్తుతం తమ ఉద్యోగులు మాస్కులు తయారుచేస్తున్నారని సోమ్ నాథ్ వివరించారు. కాగా, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో ఎవరూ కరోనా బారినపడలేదని వెల్లడించారు.