వైసీపీ తాటాకు చప్పుళ్లకు టీడీపీ భయపడదు : పంచుమర్తి

వైసీపీ తాటాకు చప్పుళ్లకు టీడీపీ భయపడదు : పంచుమర్తి
అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దౌర్జన్యకాండ కొనసాగుతోందని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ అన్నారు. వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. బోండా ఉమా, బుద్దా వెంకన్నపై దాడి చేసిన కిషోర్‌కు స్టేషన్‌ బెయిల్ ఎలా ఇస్తారు?, హత్యాయత్నం చేసిన కిషోర్‌ను బయటకు వదిలారంటే... ఏపీలో పోలీసు వ్యవస్థ ఉన్నట్టా? లేనట్టా?, స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు జరుగుతుంటే సీఎంకు పట్టదా? అని నిలదీశారు. మైదుకూరులో టీడీపీ నేత పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. అయినా వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదని తెలిపారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అచేతన స్థితిలో ఉందన్నారు.