కరోనా నివారణ మందులు పంపిణీ చేసిన ఎల్.పి కొండారెడ్డి

కరోనా నివారణ మందులు పంపిణీ చేసిన ఎల్.పి కొండారెడ్డి


దుత్తలూరు: (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండలంలోని భైరవరం మాజీ సర్పంచ్ ఎల్.పి కొండారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనాలోని హ్యూహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారిలా 163 దేశాలకు వ్యాపించి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాకు కోవిడ్-19 గా నామకరణం చేసి ఈ వైరస్ నివారణకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం జంగాలపల్లి, తురకపల్లి, భైరవరం గ్రామాలలో ఆర్స్నిక్-30 హోమియోపతి మందులను పంపిణీ చేశారు.