‘పూల మార్కెట్ బంద్.. ఎవరూ రావొద్దు’
హైదరాబాద్ : గుడిమల్కాపూర్‌లోని ఇంద్రారెడ్డి పూల మార్కెట్ ఈనెల 31 వరకు మూసి ఉంటుందని మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రకటించింది. మంగళవారం గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యులతో చైర్మన్ వెంకట్ రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఫ్లవర్ మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు వెల్లడించారు. ఉగాది పండుగ ఉందని ఎవరూ మార్కెట్‌కు రావొద్దని స్పష్టం చేశారు. పూల మార్కెట్ పూర్తిగా మూసివేసి ఉంటుందని ప్రకటించారు.
పూల మార్కెట్ బంద్.. ఎవరూ రావొద్దు’