విలేకరుల సమావేశం వివరాలు 15.03.2020
జగన్ మాటలు వింటే అధికారులు జైలుకెళ్లక తప్పదు
మాచర్ల ఘటనలో పిన్నెల్లి ని ఏ 1 ముద్దాయిగా చేర్చాలి
చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల్ని కోర్టుకీడుస్తాం
- బుద్దా వెంకన్న
కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడానికి మందులున్నాయి కానీ జగన్ వైరస్ నుంచి రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలి అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగన వైరస్ ప్రజలని పీల్చి పిప్పి చేస్తోంది. మాచర్లలో ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరపించామని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పటం సిగ్గుచేటు. మాచర్ల ఎన్నికలను రద్దు చేసి ప్రజాస్వామ్యంగా మళ్లీ ఎన్నికలు జరిపించలగలరా? ఎన్నికల్లో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన గుంటూరు, ఎస్పీ, కలెక్టర్ ని బదీలీ చేసింనదకు, మాచర్ల సీఐ ను సస్పెండ్ చేసినందుకు ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నాం. జగన్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించలేదని కేంద్రానికి ఎన్నికల సంఘం అధికారి రమేష్కుమమార్ లేఖ రాస్తే టీఎన్ శేషన్ లాగా చరిత్రలో నిలిచిపోతారు. అలా కాంకుడా జగన్ ప్రభుత్వ తప్పులను పట్టించుకోకుంటే శ్రీలక్ష్మి మాదిరిగా రమేష్కు మార్ కూడా జైలుకు వెళ్తారు. స్ధానిక ఎన్నికల్లో రాష్ర్టంలో జరిగిన పరిణామాలపై కేంద్రం ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘ: కలుగజేసుకోవాలి. కేంద్రమే నూతన డీజీపీని నియమించి ఎన్నికల ప్రక్రియ జరిపించాలి. పోలీస్ కంట్రలో అంతా కేంద్రం తీసుకోవాలి. బీహార్ కి తండ్రిలా ఆంధ్రప్రదేశ్ తయారయింది. పోలీస్ వ్యవస్ధను జగన్ తన చెప్పచెత్తలో పెట్టుకుని వ్యవస్ధని నాశనం చేశారు. టీడీపీ అభ్యర్డలు నామినేష్ వేయకుండా, వేసినవారు విత్ డ్రా చేసేలా పోలీసులే బెదిరించారు. మాపై మాచర్లపై దాడి జరిగితే ఏ పోలీసు అధికారి మా వద్దకు వచ్చి మీకు ఎలాంటి రక్షణ కావాలని అడగలేదు. కనీసం జరిగిణ ఘటనపై మాతో విచారణ కూడా జరపలేదు. మాచర్ల ఘటనలో పిన్నెల్లిని ఏ1 ముద్దాయిగా చేర్చాలి. ఆయన ప్రమేయంతోనే మాపై హత్యా ప్రయత్నం జరిగింది. కానీ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తా. మాచర్లలో ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి. రాష్ర్టంలో పోలీసులు జగన్ కి వాలంటీర్లుగా పని చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. మాచర్ల ఘటనపై బాద్యతారాహిత్యంగా వ్వహరించినందుకు గుంటూరు ఎస్పీ, కలెక్టర్ బదీలీ అయ్యారు. మిగతా అధికారులపై ప్రవేట్ కేసులు వేస్తాం. జగన్ చెప్పినట్లు వింటే అధికారులు జైలుకెళ్లక తప్పదు. అధికారుల ఇప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. టీడీపీ ప్రభుత్వం అధికారులకు పూర్తి స్వేచ్చ నిచ్చి చట్ట బ్డద్దంగా పనిచేయించింది. నేడు ఈసీకి జగన్ కి చెంపపెట్టులా తీర్పిచ్చింది. మాచర్ల ఘటనపై డీజీపీ సరిగా స్పందించలేదు, దీనికి సంబంచిందిన అధికారులందర్నీ కోర్టుకీడుస్తామని బుద్దా స్పష్టం చేశారు.
చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల్ని కోర్టుకీడుస్తాం - బుద్దా వెంకన్న