నెల్లూరులో ఎన్సీఈఆర్టీ ఏర్పాటు ఎప్పుడు?

నెల్లూరులో ఎన్సీఈఆర్టీ ఏర్పాటు ఎప్పుడు? లోక్సభలో ప్రశ్నించిన నెల్లూరు ఎంపీ ఆదాల నెల్లూరులో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎన్.సి.ఇ.ఆర్.టి) ప్రాంతీయ విద్యా సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం లోక్సభలో ప్రశ్నించారు .ఈ సంస్థ ఏర్పాటుకు ఉన్న ఇబ్బందులు ఏమిటి, వాటిని ఎలా అధిగమించనున్నారని కూడా ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్ రియల్  రాత పూర్వకంగా జవాబు చెబుతూ జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ( ఎన్సీఈఆర్టీ) ప్రాంతీయ విద్యా సంస్థ ఏర్పాటుకు గాను సంబంధిత వర్గాల ఆమోదం అవసరమని తెలిపారు. నెల్లూరులో ఈ ప్రాంతీయ శాఖ ఏర్పాటుకు వివరణాత్మక ఏర్పాటు నివేదికను కోరామని, అది అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తద్వారా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలకు ఈ సంస్థ కేంద్ర బిందువుగా ఉంటుందని తెలిపారు.