నిర్భయ దోషులకు బహిరంగ ఉరి తీసి ఉంటే బాగుండేదని....

నిర్భయ దోషులకు బహిరంగ ఉరి తీసి ఉంటే బాగుండేదని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఈరోజు తన కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రిక ప్రకటనలో  పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఆడ పిల్లపై అతి దారుణంగా ప్రవర్తించిన నిర్భయ మానవ మృగాలకు ఉరి శిక్ష పడిన రోజు గొప్ప సూర్యోదయం అని న్యాయం గెలిచిన రోజని , నిర్భయ తల్లి మరియు వారి అడ్వకేట్ న్యాయం కోసం చేసిన పోరాటాన్ని చరిత్ర గుర్తుపెట్టుకుoటుందని తన కూతురు కోసం కాకుండా యావత్ భారత దేశంలోని యువత రక్షణ కోసం జరిగిన పోరాటం గా ఆయన వారి పోరాటాని  కొనియాడారు .నిర్భయ దుర్మార్గులు ఎన్ని వక్రమార్గాలు ఎoచుకున న్యాయం ముందు చట్టం ముందు నిలబడలేదని చివరికి న్యాయమే గెలిచింది అని మహేష్ అన్నారు. కరోన మహమ్మరి దేశంలో విజృంభిస్తున్న నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడడాని ప్రజలందరూ ఆనందంతో పండగ చేసుకుంటున్నారు అని అన్నారు . ముఖ్యమంత్రి జగన్ గారు దిశ చట్టం తేవడం కాదు చిత్తశుద్ధి ఉంటే అయేషమీరా,సుగాలిప్రీతి కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.