వింజమూరు జడ్.పి హైస్కూలులో ఘనంగా సరస్వతీ పూజ
వింజమూరు (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో త్వరలో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల నేపధ్యంలో విధ్యార్ధులు, ఉపాధ్యాయులు ఘనంగా సరస్వతీ పూజను నిర్వహించారు. ప్రతి యేడాది కూడా ఈ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విధ్యార్ధులు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధిస్తుంటారు. జిల్లా స్థాయి పోటీ పరీక్షలలో సైతం తమ తమ ప్రతిభా పాటవాలను చాటుతూ ప్రభుత్వ విద్యారంగానికి తలమానికంగా నిలుస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పదవ తరగతి పరీక్షలకు ముందు ఘనంగా పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతీ విగ్రహం వద్ద పూజలు నిర్వహించడం గత కొన్నేళ్ళుగా ఆనవాయితీగా వస్తున్న ఆచారం. మధ్యాహ్న భోజనం అనంతరం సాయం సంధ్య వేళలో విద్యా విలువలను మరింతగా మెరుగుపరిచే అంశాలకు దోహదపడే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో హైస్కూలు ప్రధానోపాధ్యాయురాలు వింధ్యావళి, ఉపాధ్యాయులు యం.యస్.రెడ్డి, సలాం, మోహన్ రెడ్డి, కామాక్షయ్య, శివకోటారెడ్డి, మాల్యాద్రి, జయరామిరెడ్డి, భవానీ, రేణుక, ముంతా.కోటేశ్వరరావు, ప్రభాకర్ రెడ్డి, మాచర్ల, పాఠశాల అధ్యాపకేతర బృందం, విధ్యార్ధులు పాల్గొన్నారు.