తేది: 15.03.2020
విలేకరుల సమావేశం వివరాలు
ఎన్నికల ప్ర్రక్రియను తిరిగి ప్రారంభించాలి
- స్థానిక ఎన్నికల్లో వైసీపీ అనేక అవకతవకలకు పాల్పడుతోంది
- నామినేషన్లు వేయకుండా టీడీపీ నేతలపై దాడులకు తెగబడ్డారు
- ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
- అధికారులు సైతం వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారు
- వారిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి
- లేదంటే న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తాం
- టీడీపీ నేత ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
పేద, బడుగు బలహీన వర్గాల అభ్యన్నతికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, ప్రతిపక్షమైన, అధికారపక్షమైన సామన్యులకు అండగా ఉండటమే తమ విధి అని అటువంటి తమపై అధికార పార్టీకి చెందిన నేతలు అసభ్య పదజాలంతో దూషిస్తూ మాపై దాడులు చేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... ప్రజా సమస్యలపై ఎప్పటికప్పడు పోరాడే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ముఖ్య విధి అని, తాము తమ కర్తవ్యాన్ని నెరవేర్చుతుంటే వైసీపీ నాయకులు బాధ్యత మరిచి గుండాల్లా వ్యవహరించడం దారుణమని అన్నారు. కర్తవ్యం పక్కన పెడితే ఆత్మభిమానం దెబ్బతింటుంది. ఆత్మభిమానం పక్కన పెడితే కర్తవ్యం దెబ్బతింటుందని ఇదే ఆవేదన రాష్ట్రంలోని టీడీపీ నాయకులకు ఉందని తెలిపారు. టీడీపీ పార్టీ ప్రజల పక్షాన నిలబడే పార్టీ. కానీ వైసీపీ నేతలు మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగితూ మాపై మాటల దాడిని చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్న... వైసీపీ నాయకులు నా కుటుంబ సభ్యలను సైతం దూషిస్తూ మాటల దాడి చేయడం హేయమని అన్నారు. ఇక నుంచి వైసీపీ నేతల తప్పులను తాను విమర్శించనని, వారి తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతానని అన్నారు. నన్ను ఏ వైసీపీ నాయకుడు కూడా అసభ్య పదజాలంతో దూషించకండి, అలా దూషిస్తూ నా ఆత్మగౌరవం దెబ్బతీయొద్దని కోరారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు, టీడీపీ శ్రేణులపై జరిపిన దాడులపై సాక్ష్యాదారాలతో ఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు తాము చాలా ఫిర్యాదులు ఇచ్చామని, ఎన్నికలు వాయిదా పడినందున ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించి భాధ్యులపై చర్యలు తీసుకోని ప్రజాస్వామ్యన్ని పరిరక్షించాలన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కరోనా వైరస్ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ముందుగా ప్రస్ధావించిన సంగతి ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు వాయిదా పడటం వల్ల ఎన్నికల్లో జరిగిన అవకతకలపై ఒకొక్క ఫిర్యాదుపై సమగ్రంగా విచార జరపాలని ఆయన ఎన్నికల కమిషన్ కు విన్నవించారు. వైసీపీ నేతల ట్రాప్ లో అధికారులు పడిపోయారని వారిపై కూడా విచారణ జరపాలని దీపక్ రెడ్డి కోరారు. తిరిగి ఎన్నికల కమిషన్ మరోసారి ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలన్నారు. ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనపై విచారణ జరిపించాలని, బాధ్యత రహిత్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే విధులనుంచి తొలగించాలని అప్పుడే ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం కలుగుతుందని ఆయన హితవు పలిపారు. వైసీపీ ఉచ్చులో కొందరు అధికారులు పడ్డారు అధికారులు వైసీపీ ఆరాచకాలకు వంత పాడితే అధికారుల ఉద్యొగాలు ఉడుతాయని హితవు పలికారు. ప్రజల డబ్బులు జీతంగా తీసుకోని కొందరు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని అటువంటి అధికారులపై విచారణ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామని దీపక్ రెడ్డి అన్నారు. ఇటువంటి అధికారులను చీడపురుగులను తుదముంట్టించాలన్నారు. ఎన్నికల సక్రమ నిర్వహణ కలెక్టర్లు, ఎస్పీల బాధ్యతని తప్పు చేస్తే సస్పెన్షన్ చేస్తారనే భయం అధికారులకు ఉండే విధంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలన్నారు. మాచర్ల సీఐని సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని అలాగే తప్పు చేసిన ప్రతి అధికారని సస్పెండ్ చేయాలి ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల తప్పులను కప్పిపుచ్చే అధికారులను సర్వీసుల నుంచి తప్పించడం కంటే వారిపై పూర్థిస్తాయి చర్యలు తీసుకోవాలన్నారు. తప్పు చేసిన ప్రతి అధికారిని కూడా వెంటనే ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయాలన్నారు. అప్పుడే అధికారుల్లో భయంతో పాటు బాధ్యత వస్తుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ స్పందించకపోతే తామే స్వయంగా కోర్టుల్లో కేసులు వేసి న్యాయం కోసం పోరాడతామన్నారు. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకునే అధికారులు రాజకీయనాయకుల చెప్పడు మాటలు విని తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని దీపక్ రెడ్డి హెచ్చరించారు. పులివెందులలో టీడీపీ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని, పులివెందులలో నామినేషన్ వేసేందుకు ఒక్కరూ ఉండరా అని ఆయన ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. పులివెందుల రాజకీయాన్ని ఆదర్శంగా తీసుకున్న వైసీపీ నేతలు రాష్ట్రంలో టీడీపీ నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో సైతం టీడీపీ నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచరల్లోనూ టీడీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వలేదన్నారు. వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు ప్రజాస్వామ్యం పై ఉన్న నమ్మకాన్ని ఎన్నికల సంఘమే నిలపాలని దీపక్ రెడ్డి ఎన్నికల కమిషన్ ను కొరారు. 72 ఏళ్ల నుంచి వస్తున్న వ్యవస్థలను తొమ్మిది నెలల్లో నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ మరో బీహార్ లా మారిపోయిందని, మంత్రి కోడాలి నాని భాషలో చెప్పాలంటే ఏపీ మరో బీహార్ అమ్మమొగుడిలా మారిందన్నారు. అదే మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భాషలో చెప్పాలంటే (ఎప్పడు వచ్చామో కాదు) 72 ఏళ్ల రాజ్యాంగాన్ని కేవలం రెండు నెలల్లోనే అపహ్యాసం చేసి చర్రిత సృష్టించారని దీపక్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఎన్నికల ప్ర్రక్రియను తిరిగి ప్రారంభించాలి