లాక్‌డౌన్‌పై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

25–03–2020
అమరావతి



అమరావతి: లాక్‌డౌన్‌పై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు
లాక్‌డౌన్‌ సందర్భంగా నిత్యావసరాలకోసం ప్రజలు ఒకే సమయంలో పెద్దఎత్తున గుమిగూడ్డంపై చర్చ
కోవిడ్‌ నివారణకు సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశం దీనివల్ల దెబ్బతింటోందని సమావేశంలో చర్చ
ప్రజల్లో నిత్యావసరాలు దొరకడంలేదనే ఆందోళన లేకుండా చేయడానికి, అదే సమయంలో సామాజిక దూరం పాటించేలా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చ


సమావేశంలో నిర్ణయాలు
నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని నిర్ణయం
ఒకేచోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం
ఈ దుకాణాలు నిర్ణీత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం
అలాగే ప్రతి దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయాలని నిర్ణయం
అలాగే నిత్యావసరాల దుకాణాల వద్ద కూడా ప్రజలు దూరం దూరంగా నిలబడేలా మార్కిగ్‌ చేయాలని నిర్ణయం
కూరగాయలు, నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు
వీలైనంత త్వరగా తీసుకోవాలని,
అంతవరకు ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ అనుమతించాలని నిర్ణయం
ప్రజలు నిత్యావసరాలకోసమే బయటకు రావాలి
ఎవ్వరూ కూడా 2–3 కి.మీ పరిధి దాటిరాకూడదు
ఆమేరకు నిత్యావసరాలు వారికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి
పాలు లాంటి నిత్యావసరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలి
నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
144 సెక్షన్‌ రోజంతా అమల్లో ఉంటుంది
నలుగురికి మించి ఎవ్వరూ కూడా ఎక్కడా గుమి కూడరాదు
అలాగే సప్లై చెయిన్‌ దెబ్బతినకుండా గూడ్స్‌ వాహనాలు, నిత్యావసరాలు తీసుకొచ్చే వాహనాల రాకపోకలకు అనుమతివ్వాలని నిర్ణయం
కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లను కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా టీవీలు, పేపర్లలో ప్రకటించాలని సీఎం నిర్ణయం
ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే... 1902 కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేయాలి: సీఎం
కాల్‌సెంటర్‌లో ఒక సీనియర్‌ అధికారిని పెట్టండి: సీఎం
ఫిర్యాదులు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోండి: సీఎం
తీసుకున్న కఠిన చర్యలను కూడా పబ్లిసైజ్‌ చేయాలి: సీఎం


నిల్వచేయలేని పంటల ఉత్పత్తుల విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న సీఎం
ప్రజలకు నిత్యావసరాలు అందించడంలో కీలక పాత్ర పోసిస్తున్న హమాలీలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని సమావేశంలో నిర్ణయం


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు