దేవినేని మురళి ఆశయసాధనకు కృషి :
విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్
దివంగత మంత్రివర్యులు దేవినేని నెహ్రూ సోదరుడు దివంగత దేవినేని మురళి గారి 32 వ వర్థంతి కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య గుణదల నెహ్రూ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ మాట్లాడుతూ మా బాబాయి దేవినేని మురళి ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ యువతకు స్పూర్తిగా నిలిచారు అని, మీరు మమ్మల్నందరినీ దుఃఖ సాగరంలో ముంచి నేటికి 32 సంవత్సరాలు అయిన సరే,మీ ఆశయసాధనకై నిరంతరం కృషి చేస్తూనే వుంటామని ఆ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని అన్నారు. ఆయన మా మధ్య లేకపోయినా సరే వారి స్ఫూర్తి మాలో నిరంతరం రగులుతూనే ఉంటుంది అని,పేద ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం మాకు ఆదర్శంగా నిలిచింది అని,వారి గుండెల్లో ఆయన స్తానం పదిలంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది అని అన్నారు.బొప్పన భవకుమార్ గారు మాట్లాడుతూ ఆ రోజుల్లో విద్యార్థుల సమస్యల పై,పేద ప్రజల పక్షాన మురళి గారు పోరాటం చేసిన తీరు నాకు ఇప్పటికి గుర్తు ఉన్నాయి అని,ఆయన లేని లోటు తీర్చలేనిది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ ,సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ డిప్యూటీ మేయర్ సత్యం, పెద్ద ఎత్తున అభిమానులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.