స్పందన కార్యక్రమంపై సచివాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*

*03–03–2020*
*అమరావతి*


*అమరావతి: స్పందన కార్యక్రమంపై సచివాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


*ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లపట్టాలపై అధికారులు, కలెక్టర్లతో సమీక్షించిన సీఎం*
*జిల్లాల వారీగా ఇవ్వనున్న ఇళ్లపట్టాలు, స్థలాల గుర్తింపు, అభివృద్దిపై సీఎం సమీక్షలో విస్తృత చర్చ* 
*ఇళ్లస్థలాల కోసం గుర్తించిన భూముల్లో ప్లాట్ల డెవలప్‌మెంట్‌ వేగవంతంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం*
*స్థలాల గుర్తింపు, ప్లాట్ల అభివృద్ధిని అనుకున్న గడువులోగా పూర్తిచేయాలి*
*ఈవిషయంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులకు సీఎం ఆదేశం*
*ఉగాది సమీపిస్తున్న నేపధ్యంలో ప్లాట్లను అభివృద్ధి చేసి పంపిణీకి సిద్ధంచేయాలన్న సీఎం*
*ఆయా జిల్లాల్లో ఉన్నతాధికారులు పర్యటించి ఇళ్లపట్టాల విషయంలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశం*
*అనుమతులు, ఆర్థిక వనరుల కేటాయింపు విషయంలో జిల్లా కలెక్టర్లు సహా యంత్రాంగానికి అండగా ఉండాలని సీఎం ఆదేశం*
*25 లక్షల ఇళ్లపట్టాలు ఉగాదిరోజున ఇవ్వాలన్న మన కలను నిజం చేసేదిశగా శరవేగంగా పనిచేయాల్సి ఉందన్న సీఎం*
సాధ్యమైనంతవరకూ ఇళ్లస్థలాలే ఇవ్వాలన్న సీఎం


*కరోనా వైరస్‌ నిరోధంపై సీఎం సమీక్ష*


కరోనా వైరస్‌ నిరోధానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది: సీఎం
తెలంగాణలో కేసు నమోదయ్యింది: సీఎం
రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎలాంటి కేసు నమోదు కాలేదు: సీఎం
గల్ఫ్‌ దేశాల్లో బాగా విస్తరిస్తోంది: సీఎం
ఈ విషయంలో ప్రజలను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదు: సీఎం
కాని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి: సీఎం
జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ సెంటర్ల ఏర్పాటుపై ధ్యాసపెట్టాలి: సీఎం
వైద్య సిబ్బందికి శిక్షణ చాలా ముఖ్యం : సీఎం
వైద్యాధికారులను కలుపుకుని శిక్షణ కార్యక్రమాలపై కార్యాచరణ ముఖ్యం: సీఎం
కరోనాపై ప్రజలను చైతన్యం చేయాలి: సీఎం
కరోనా వైరస్‌ ఎలా వస్తుంది? వస్తే ఏం చేయాలి? అన్నదానిపై ప్రచారం చేయాలి: సీఎం
ప్రతి గ్రామ సచివాలయంలో కరపత్రాలను అతికించాలి:
బాడీ మాస్క్‌లు, మౌత్‌ మాస్కులను అందుబాటులో ఉంచుకోవాలి:
ఆర్డర్లు ఇప్పటినుంచే ఇస్తే బెటర్‌ :
అప్పటికప్పుడు ఆందోళన చెందే కన్నా.. ముందస్తుగా సన్నద్ధం కావాలి:


*కరోనా వైరస్‌పై కలెక్టర్లకు వివరాలు అందించిన వైద్యారోగ్యశాఖ కార్యదర్శి జవహర్‌ రెడ్డి*
ఇప్పటివరకూ 64 దేశాల్లో వైరస్‌ వ్యాపించిందన్న అధికారులు
జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
కేవలం 5శాతం కేసుల్లో మాత్రమే ప్రమాదకర పరిస్థితులున్నాయి
వయోవృద్ధులు ఎక్కువగా విషమ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు
సార్స్‌ను మనం వియవంతంగా ఎదుర్కొన్నాం
జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు
ఐసోలేషన్‌ ప్రక్రియ ముఖ్యమైంది
ఈ కేసును డీల్‌ చేయడానికి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్స్‌ ఏర్పాటు
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన దేశాలనుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టి


*స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం సమీక్ష*


*నెలరోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేయాలి: సీఎం*
హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది: సీఎం
ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జెట్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు: సీఎం
రేపు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అధికారులు కలుస్తారు: సీఎం
*పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలకోసం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చాం: సీఎం*
డబ్బులు, లిక్కర్‌లను పూర్తిగా నిరోధించాలన్న దృక్పథంతో ఆర్డినెన్స్‌ తెచ్చాం: సీఎం
పోలీస్‌యంత్రాంగం చాలా దృఢంగా పనిచేయాలి, దీన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలి: సీఎం
*డబ్బులు పంచుతూ, ఎన్నికల తర్వాత కూడా నిర్ధారణ అయితే ఆ వ్యక్తిపై అనర్హత వేటు విధిస్తాం, మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది: సీఎం*
జిల్లా ఎస్పీలు డబ్బులను, మద్యాన్ని అరికట్టాలి:
ప్రతి గ్రామంలో ఉన్న పోలీస్‌ మిత్రలను, గ్రామంలో మహిళా పోలీసును పూర్తిస్థాయిలో వినియోగించాలి:
ఎక్కడా డబ్బు పంపిణీ చేశారన్న మాట రాకూడదు :
ఎన్నికల్లో లిక్కర్‌ పంచారన్న మాట రాకూడదు:
ఎవరో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వచ్చి కోట్లకు కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలవడంకాదు, ఊరిలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి వారికి సేవచేసే
వ్యక్తులు ఎన్నిక కావాలి :సీఎం
ప్రజలకు సేవచేసే వ్యక్తులు ఎన్నికల్లో ఎన్నికవడానికి కావాల్సిన అవకాశాలను సృష్టించడానికే మనం ఈ ఆర్డినెన్స్ తెచ్చాం : సీఎం
*మన రాష్ట్రంలో స్థానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలి:* 
*సాధారణ ఎన్నికల అక్రమాలు, ఉల్లంఘనల నిరోధానికి యాప్‌ ఉపయోగించిన మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఒక యాప్‌ అందుబాటులో ఉంచాలి:*
ఎన్నికల అధికారులకు, పోలీసు అధికారులకు ఈ డేటా చేరాలి:
గ్రామాల్లో ఉండే పోలీసు మిత్రలు, గ్రామ సచివాలయంలో ఉండే మహిళా మిత్రలు, గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల వద్ద, ప్రజల వద్ద ఈ యాప్‌ ఉండాలి:
ఏం జరిగినా వెంటనే ఈ యాప్‌లో నమోదు కావాలి:
ఎవరైనా తప్పులు చేస్తే అనర్హత వేటు వేయాలి, జైలుకు పంపాలి:
ఈ అంశాలతో ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్‌ కాపీని గ్రామ సచివాలయాల్లో డిస్‌ప్లే చేయాలి సీఎం 


*పెన్షన్లపై సీఎం*


ఈనెల 1న జరిగిన గడపగడపకూ పెన్షన్ల పంపిణీని సమీక్షించిన సీఎం
*పెన్షన్ల పంపిణీ బాగా జరిగిందని కలెక్టర్లను ప్రశంసించిన సీఎం*
వచ్చే నెలలో గడపగడపకూ పెన్షన్ల పంపిణీ మరింత వేగంగా జరగాలి: సీఎం
ప్రతి యాభై కుటుంబాలకు మ్యాపింగ్‌ కరెక్టుగా జరగాలి: సీఎం
*వచ్చే నెల 2 గంటల్లోగా పెన్షన్ల పంపిణీచేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలి: సీఎం*