అమరావతి
మార్చి 14, 2020
ఎమ్మెల్సీ కంతేటి భార్య శ్రీమతి జానకి మరణంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి తీవ్ర సంతాపం
సీనియర్ రాజకీయ నాయకుడు, వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ శ్రీ కంతేటి సత్యనారాయణరాజు భార్య శ్రీమతి జానకి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కంతేటి సత్యనారాయణరాజుకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, అలానే ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. కంతేటి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.