ప్రజల ఆరోగ్యం కన్నా స్థానిక ఎన్నికలు ముఖ్యమా ?
కరోనా మహమ్మారి నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు శూన్యం
కాపులను బీసీలను దారుణంగా మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ కు కులాల పేరు ఎత్తే అర్హత ఉంద.
సీఎం జగన్ పాలనలో అభివృద్ధి పడకేసిందని, ప్రజారంజక పాలన అందిస్తార అనుకుంటే ఫ్యాక్షన్ పాలన అంటే ఏంటో ఐదు కోట్ల మందికి ప్రత్యక్షంగా చూపిస్తున్నారని, ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారికి భయపడి ఆందోళన చెందుతుంటే సీఎం జగన్ స్థానిక సంస్థల నిర్వహించాలని నానా యాగీ చేస్తున్నారంటే రాజధాని అమరావతిని విశాఖపట్నానికి తరలించాలనే కుట్ర స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని, సీఎం జగన్ కు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కన్నా స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యమా ? అని ఈ రోజున బెంజిసర్కిల్ వద్ద గల పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు సెంట్రల్ ఆంధ్ర పార్లమెంటరీ సంయుక్త కమిటీ సభ్యులు పోతిన వెంకట మహేష్ ముఖ్యమంత్రి జగన్ తీరును దుయ్యబట్టారు. పదే పదే కేంద్రం నుంచి వచ్చే 5వేల కోట్ల రూపాయలు నిధులు రావని అభివృద్ధి ఆగిపోతుందని మాట్లాడుతున్నారు మరి రంగులు వేయడానికి 1300 కోట్లు, గ్రామ వాలంటీర్లకు 7500, కోట్లు సీఎం ఇంటిని ఆధునీకరించి కునేందుకు 20 కోట్లు, ప్రధాన సలహాదారు 500 కోట్లు వెరసి సుమారు పదివేల కోట్ల ప్రజాధనం వృధా వల్ల అభివృద్ధి ఆగిపోలేదా?అని ప్రశ్నించారు. ఈ పది నెలల కాలంలో ఎక్కడైనా ఒక బస్తా సిమెంట్ వేసి ఇటుక మీద ఇటుక పెట్టిన పాపానపోలేదు, మీకు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఉందాని ఎద్దేవా చేశారు. కేంద్రం నుండి నిధులు ఆగిపోతాయని ఆందోళన ఉంటే సీఎం జగన్ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక వినతిపత్రం ఇవ్వండి చాలు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ నిధులు రాష్టం కు వచ్చేలాగా ప్రయత్నిస్తారని, ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాల్సింది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాదు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కోసం కేసు వేయాలి అని డిమాండ్ చేశారు .
రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఇంతవరకూ ఎన్ని చోట్ల స్క్రీనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిందో, కరోనా నియంత్రణకు హెల్త్ సెంటర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో , మందులు మాస్కులు అన్న అందుబాటులోకి తెచ్చే పరిస్థితి ఉందా లేదో ప్రజలకు తెలియచేయాలని కోరారు. పారాసెట్మాల్ బ్లీచింగ్ కొనుగోలలో వందల కోట్లు కాజేసి ప్రయత్నం జగనన్న చేస్తున్నారనే అనుమానం కలుగుతుంది అని, కరోనా మహమ్మారి నియంత్రించడంలో ప్రభుత్వ చర్యలు శూన్యం ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కొరారు .కాపులను బీసీలను దారుణంగా మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ కులాల పేరు ఎత్తే అర్హత ఉందా అని ప్రశ్నించారు. నామినేటెడ్ పదవులను తన సామాజిక వర్గం తో నింపుకుని కులాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజలు కరోనా కన్నా జగన్ పాలన గురించి ఎక్కువగా భయపడుతున్నారని కరోనా పై జగన్ కు ఉన్న తెలివితేటలతో వారి కీర్తి ఖండాంతరాలు పాకిందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ కరోనా వ్యాప్తి చెందకుండా ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు.