ఎన్నికల వాయిదా కుట్రపూరితం:పేర్ని

ఎన్నికల వాయిదా కుట్రపూరితం:పేర్ని
మచిలీపట్నం: స్థానిక ఎన్నికలను కావాలనే వాయిదా వేశారని.. ఒక్క కరోనా కేసును అడ్డం పెట్టుకుని వాయిదా వేయడం కుట్రపూరితమని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే ఇలాంటి చర్యలు తీసుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయితే కేంద్రం నుంచి రూ. 4 వేల కోట్లు వచ్చేవన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని కావాలనే హడావిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తెదేపా హయాంలో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగలేదా? అని నాని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మళ్లీ స్థానిక ఎన్నికల్లోనూ వస్తాయని నాని దీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వాయిదా పడినంత మాత్రాన ఫలితాల్లో ఎలాంటి మార్పులు రావన్నారు. ఎన్నికలు వాయిదా పడ్డాయని వైకాపా అభ్యర్థులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్ని నాని భరోసా ఇచ్చారు.


Popular posts
కేసులు ఉపసంహరించుకోవాలి:తంగిరాల సౌమ్య
ఒరిస్సా వలస కూలీలకు నిత్యావసరాల పంపిణీ చేసిన సక్షమ్ 
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఉప రాష్ట్రపతి కి నిమ్మరాజు చలపతిరావు సన్మానం
మే 3 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ : మోడీ