ముప్పైయేళ్ళకు యం.పి.డి.ఓ కార్యాలయం బోర్డు మారింది....

*ముప్పైయేళ్ళకు యం.పి.డి.ఓ కార్యాలయం బోర్డు మారింది.... వింజమూరు: (అంతిమతీర్పు- దయాకర్ రెడ్డి) : ఎట్టకేలకు 30 సంవత్సరాల విరామం అనంతరం వింజమూరు యం.పి.డి.ఓ కార్యాలయం ప్రధాన భవనంపై నూతన హంగులతో బోర్డు మారింది. వివరాలలోకి వెళితే 1982 లో అప్పటి సమితి అధ్యక్షులు జొన్నలగడ్డ.రామానాయుడు హయాంలో వింజమూరులో సమితి భవన నిర్మాణం జరిగింది. అప్పట్లో కార్యాలయంపై సమితి భవన సముదాయము ఉండేదని పలువురు పేర్కొన్నారు. తరువాత ముఖ్యమంత్రిగా పదవీ భాధ్యతలు చేపట్టిన స్వర్గీయ నందమూరి.తారక రామారావు మండలాల వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో వింజమూరు మండల కేంద్రంగా రూపాంతరం చెందింది. అప్పట్లో ఈ కార్యాలయ భవనం ప్రధాన మార్గం పై భాగంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం అని ప్రచురించారు. తదుపరి ఈ బోర్డు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ వెలిసిపోయి రూపురేఖలు మారిపోయాయి. అధికారులు వస్తున్నరు, పోతున్నారు కానీ ఈ బోర్డుపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. అయితే ఇటీవల నూతనంగా వింజమూరు యం.పి.డి.ఓ గా భాధ్యతలు చేపట్టిన ఎస్.కనకదుర్గా భవాని ఈ బోర్డుపై దృష్టి సారించారు. అనుకన్నదే తడువుగా భావించి నూతనగా బోర్డుకు పెయింటింగ్ వేయించారు. కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ఎదురుగా దర్శనమిస్తున్న బోర్డు తళుక్కుమనడంతో ఔరా ఎనాళ్ళకు బోర్డుకు మోక్షం కలిగింది అని సర్వత్రా చర్చించుకుంటూ యం.పి.డి.ఓ కు అభినందనలు తెలియజేస్తున్నారు.