జర్నలిస్టులు అందరూ మాంచో ఫెర్రర్ ఆర్డీటీ  కి   అండగా ఉండాలి.

జర్నలిస్టులు అందరూ మాంచో ఫెర్రర్ ఆర్డీటీ  కి   అండగా ఉండాలి.


అనంతపురం, ఏప్రిల్ 8 :


రాజశేఖర్ రెడ్డి, డైరెక్టర్ ఇతర సిబ్బందిని సన్మానించిన జర్నలిస్టులు.


👉మచ్చా రామలింగారెడ్డి,
 జాతీయ సభ్యులు,
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (I.J.U)


✍ప్రెస్ క్లబ్ లో నాలుగు రోజుల పాటు జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ.


🙏కరోన ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను ఆదుకున్నoదుకు జర్నలిస్టులు అందరూ ఆర్డిటికి రుణపడి ఉండాలని మచ్చా రామలింగారెడ్డి అన్నారు. నా మీద ప్రేమతో నేను అడిగినా వెంటనే 800 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినందుకు.. అన్నే ఫెర్రర్, మాంచో ఫెర్రర్, విశాల ఫెర్రర్ లకు ధన్యవాదాలు..🙏


✍ఈ రోజు అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకుల పంపిణీ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డిటి డైరెక్టర్లు రాజశేఖర్ రెడ్డి, నిరంజన్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ నాయకుడు మచ్చా రామలింగారెడ్డి, వార్త బ్యూరో ఇంచార్జ్ జోగేశ్వర్ రెడ్డి, ఆర్డిటి డైరెక్టర్ రఫీ, కృష్ణవేణి సిబ్బంది భావనారాయణ, మోహన్ మురళి, వన్నప్ప, జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ప్రధాన కార్యదర్శి విజయరాజు,  ఆర్గనైజింగ్ సెక్రటరీ శివ ప్రసాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు దిలీప్, హనుమంత్ రెడ్డి, కుల్లాయస్వామి, నాగేంద్ర నందు టైమ్స్ ఎడిటర్ భాస్కర్ రెడ్డి, మీడియా ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆదినారాయణ శివానంద, కృష్ణమూర్తి ఇతరులు పాల్గొన్నారు.


✍నాలుగు రోజుల పాటు వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఆర్డిటి డైరెక్టర్లు రాజశేఖర్ రెడ్డి, నిరంజన్, రఫీ, కృష్ణవేణి సిబ్బంది భావనారాయణ, మోహన్ మురళి, వన్నప్ప లను జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున సన్మానించడం జరిగింది, అనంతరం మచ్చా రామలింగారెడ్డి, జోగేశ్వర్ రెడ్డి మెమొంటోలను అందజేశారు.


✍భోగేశ్వర రెడ్డి వార్త బ్యూరో ఇన్చార్జి మాట్లాడుతూ మచ్చా రామలింగారెడ్డి ని అభినందిస్తున్నానని, ఆర్డీటీ తో  మాట్లాడి ఇంత మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.


✍నాలుగు రోజుల పాటు 800 మంది  జర్నలిస్టులకు సబ్ఎడిటర్లకు, రాప్తాడు, సింగనమల, నియోజకవర్గలు, మీడియా ఎంప్లాయిస్ కి, అందరికీ పంపిణీ చేసినందుకు జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏🙏🙏


💎DIST.. JOURNALIST DEVELOPMENT SOCIETY, ANANTAPURAMU💎