మాస్కు లేకుండా బయటికొస్తే గుంటూరులో రూ. వెయ్యి జరిమానా

మాస్కు లేకుండా బయటికొస్తే గుంటూరులో రూ. వెయ్యి జరిమానా


     గుంటూరు, ఏప్రిల్,10,(అంతిమ తీర్పు) :             ఉదయం 6 నుంచి 9 గంటల వరకే  ప్రజలకు అనుమతి
ఆ సమయంలోనూ మాస్కులు తప్పనిసరి
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రహదారులపైకి అనుమతి లేదన్న కలెక్టర్
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆయా జిల్లాల్లో కూడా అధికార యంత్రాంగం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. లాక్‌డౌన్‌లో ప్రజలు బయటికి రాకుండా, అత్యవసర పని మీద వచ్చినా కూడా సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన గుంటూరు జిల్లా యంత్రాంగం.. ముఖానికి మాస్కు లేకుండా  ఎవరైనా బయటికి వస్తే రూ. వెయ్యి వరకూ జరిమానా విధించాలని నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున  లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. అవసరం ఉన్న వారు మాత్రమే ఉదయం 6 నుంచి 9 గంటల వరకే బయటకు రావాలని సూచించారు. అప్పుడు కూడా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 లోపు ఆఫీసులకు వెళ్లి.. సాయంత్రం 5 నుంచి 7 గంటల సమయంలో తిరిగి తమ ఇళ్లకు చేరుకోవాలని తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రహదారులపైకి ఎవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు