16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ. :తహసీల్దార్ చేవూరి శ్రీనివాసులు

16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ*తహసీల్దార్ చేవూరి శ్రీనివాసులు
వరికుంటపాడు: 
ఈ నెల 16 నుండి రెండో విడత రేషన్ పంపిణి జరుగుతుందని  వరికుంటపాడు తహసీల్దార్ చేవూరి శ్రీనివాసులు సోమవారం తెలిపారు. ఒక వ్యక్తి కి ఐదు కేజీ లు చొప్పున బియ్యం పంపిణి జరుగుతుందని ఈ రేషన్ వాలంటీర్స్ ద్వారా లబ్ది దారులు కి ఇంటి వద్దకే చేరుస్తాం అని ఎవరు రేషన్ దుకాణానికి వెళాల్సిన అవసరం లేదని తెలిపారు.వరికుంటపాడు మండలం మొత్తం 34 రేషన్ దుకాణాలు ఉన్నాయి అని వీటి ద్వారా సరుకులు సకాలం లో అందించే ఏర్పాటులు జరుగుతున్నాయి అన్నారు. ప్రత్యేక వాహనం ద్వారా రేషన్ ను తెచ్చి వాలంటీర్స్ సాయం తో ఇంటి వద్దనే పంపిణి చేయడం జరుగుతుందన్నారు. అలాగే కరోనా వైరస్ నేపథ్యంలో నిత్యావసరాల సరుకులు ధరల నియంత్రణ కు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని నిత్యవసర వస్తువు లను అధిక ధరకు విక్రయించకూడదని ఈ నియమాల ఉల్లఘన కి పాల్పడిన వ్యాపారులను పీడీ యాక్ట్, నిత్యావసర వస్తువుల చట్టం కింద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు, ప్రతి షాప్ యజమాని ప్రభుత్వం దరల నియంత్రణ పట్టిక ను ఉంచాలన్నారు.ఉదయం 6 నుంచి 9 వరకు మాత్రమే షాప్ లు తెరిచి ఉంచాలని వివరించారు.