కర్నూలు జిల్లాలో మొత్తం 3 కరోనా పాజిటివ్ కేసులు:  కలెక్టర్ వీరపాండియన్

Flash..Flash ..Flash..
-4-4-2020- Kurnool - Covid- 19 Media Bulletin at 10 am*


*కర్నూలు జిల్లాలో ఈ రోజు 3 కోవిడ్-19  పాజిటివ్ కేసులు నిర్ధారణ... కర్నూలు నగరం  రోజా వీధి, అవుకు, బనాగనిపల్లె పట్టణ కేంద్రాలలో  ఒక్కొక్కటి చొప్పున 3 కేసులు నిర్ధారణ అయ్యాయి... నోస్సం తో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 4 కరోనా పాజిటివ్ కేసులు:  కలెక్టర్ వీరపాండియన్*


*మొత్తం సాంపిల్స్ టెస్టింగ్ కు పంపినవి: 449; వారిలో ఢిల్లీ జమాత్ కు వెళ్లి జిల్లాకు వచ్చిన వారి శాంపిల్స్ టెస్టింగ్ కు పంపినవి :338 మంది*: కలెక్టర్ వీరపాండియన్


*నిన్న రాత్రి , ఈ రోజు ఉదయం అనంతపురం, తిరుపతి కరోనా ల్యాబ్ ల  నుండి రిపోర్టులు వచ్చినవి:90; (నిన్న రాత్రి 80 నెగెటివ్) - ఈ రోజు ఉదయం రిపోర్టులు వచ్చినవి 10, వాటిలో 7 నెగటివ్;  పాజిటివ్:3 (ఢిల్లీ జమాత్ వెళ్లి వచ్చిన వారిలో)* : కలెక్టర్ వీరపాండియన్


*ఈ రోజు మధ్యాహ్నం, సాయంత్రం తిరుపతి, అనంతపురం కరోనా ల్యాబ్ ల నుండి మరిన్ని రిపోర్టులు వస్తాయి.. రిపోర్టులు వచ్చిన తరువాత కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తాం*: కలెక్టర్ వీరపాండియన్


*ప్రజలు ఆందోళన చెందకుండా..కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి కోసం స్థానిక అధికారులు, పోలీసులు తీసుకునే జాగ్రత్త చర్యలకు సహకరించండి*: *కలెక్టర్ వీరపాండియన్*


*కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం పాజిటివ్ వచ్చిన 3 కేసుల ప్రాంతాల్లో ..కర్నూలు రోజా వీధి  చుట్టు పక్కల 3 కిలోమీటర్ల కంటైన్మెంట్ జోన్, 5 కిలో మీటర్ల బఫర్ జోన్,  అవుకు, బనాగనిపల్లె పట్టణాల్లో 3 కిలోమీటర్ల కంటైన్ మెంట్ జోన్, 7 కిలోమీటర్ల బఫర్ జోన్ ప్రకటించాం.. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ అయిన వారందరూ తక్షణమే హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి..వారికి కరోనా టెస్ట్ లు చేయించడానికి, టోటల్ శానిటేషన్ చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమీషనర్లు, ఇన్సిడెండ్ కమాండర్స్, ఎంపిడిఓ లకు ఆదేశాలను ఇచ్చాం: కలెక్టర్ వీరపాండియన్*


*పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనల ప్రకారం రాకపోకల  కట్టడి...నిత్యావసరాలకు ఇబ్బంది లేదు.. పోలీసు బందోబస్తు ఏర్పాటు:కలెక్టర్ వీరపాండియన్*


*పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని మొత్తం 4 సెక్టర్లుగా విభజించి మెడికల్ బృందాలతో ఆ ప్రాంతంలో నివాసమున్న వారందరికీ  మెడికల్ స్క్ర్రీనింగ్ చేయిస్తాం.. ఆ ప్రాంతమంతా క్రిమి సంహార రసాయనాల స్ప్రే చేయించి.. శానిటేషన్ చేయిస్తున్నాం*


*అందరూ అప్రమత్తంగా ఉండాలి... ఇళ్లలోనే ఉండండి..బయటకు రావద్దు.. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించండి...కోవిడ్-19 అనుమాన లక్షణాలు ఉంటే వెంటనే మెడికల్ ఆఫీసర్, మునిసిపల్ కమీషనర్,  తహశీల్దార్, ఎంపిడిఓ లకు సమాచారం ఇవ్వండి:కలెక్టర్ వీరపాండియన్*


*కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేసాం.. కర్నూలు కరోనా కాల్ సెంటర్ 9441300005 కు లేదా 104 కు కాల్ చేసి కరోనా పై ఏవైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చు*


*కోవిడ్-19/కరోనా పై వదంతులను/పుకార్లను పుట్టిస్తే లేదా సోషల్ మీడియాలో లేదా మీడియాలో వ్యాప్తి చేస్తే చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం:కలెక్టర్ వీరపాండియన్.


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ నేడు 172 వ జయంతి.
Image
శాసన రాజధాని కుడా అమరావతిలో లేకుండా చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలినాని అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అమరావతి 5 కోట్ల ఆంధ్రుల బావిషత్తు "కొడాలి నాని గారికి బుద్ధి రావాలని" ఉద్దండ్రాయునిపాలెంలో నాని గారి దిష్టిబొమ్మని పాడికట్టి శవ యాత్ర చేశారు..
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా,
Image