కరోనా పై భారత్ విజయం సాధిస్తుంది: భారత ఉపరాష్ట్రపతి ఆకాంక్ష
----------------------------------------------------
సీనియర్ జర్నలిస్ట్ చలపతిరావుకు ఫోన్ చేసి పలువురికి అభినందనలు
----------------------------------------------------
ప్రస్తుత విపత్తు కాలంలో ప్రజలను కాపాడటానికి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయని భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మంగళవారం ఉదయం సీనియర్ జర్నలిస్ట్ నిమ్మ రాజు చలపతిరావు కు స్వయంగా ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణతో, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. కరోనా పై అంతిమ విజయం సాధించే వరకు అకుంఠిత దీక్ష ను మనం ప్రదర్శించాల్సి ఉందన్నారు. ఈ మహమ్మారిని త్వరలోనే చిత్తు చేస్తామన్న నమ్మకం తనలో ఉందని ఈ విజయం నేర్పిన అనుభవంతో భావి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొగలమని తాను పూర్తిగా విశ్వసిస్తున్నానని శ్రీ వెంకయ్య నాయుడు గారు తెలపడం భారత ప్రజానీకానికి మరి ఎంతో ఆత్మస్థైర్యం, మనోధైర్యాన్ని కలుగజేస్తుంది. .....
కరోనా పై భారత్ విజయం సాధిస్తుంది: భారత ఉపరాష్ట్రపతి ఆకాంక్ష