స్వీయ నిర్భంధంతోనే కరోనా వైరస్ కట్టడి సాధ్యం*యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని.

*స్వీయ నిర్భంధంతోనే కరోనా వైరస్ కట్టడి సాధ్యం*యం.పి.డి.ఓ కనకదుర్గా భవాని..


. వింజమూరు, ఏప్రిల్ 3 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): ప్రజలు స్వీయ నిర్భంధం పాటించిన పక్షంలోనే కరోనా వైరస్ కట్టడి సాధ్యపడుతుందని వింజమూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎస్.కనకదుర్గా భవాని అన్నారు. శుక్రవారం నాడు స్థానిక జీ.బి.కే.ఆర్ ఎస్.టి కాలనీవాసులకు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి ట్రస్ట్ అందజేసిన శానిటైజర్లను యం.పి.డి.ఓ తమ సిబ్బందితో ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నెల 14 వ తేదీ వరకు ప్రభుత్వ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కాలనీవాసులకు విజ్ఞప్తి చేశారు. జన సమూహాల ద్వారా ఈ వైరస్ అత్యంత వేగంగా అందరికీ వ్యాపించే ప్రమాదముందన్నారు. అందు వలననే లాక్ డౌన్ విధించడం జరిగిందన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల సూచనల మేరకు ప్రజలు ఒకరికొకరు సమదూరం పాటించాలని ఆమె కోరారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్ల వినియోగం వలన కరోనా మహమ్మారిని కొంతమేర నియంత్రించవచ్చునన్నారు. కేవలం అవగాహనతోనే వ్యాధికి  దూరం కావాలన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు. చేతులను ఎప్పటికప్పుడు నిర్ణీత వ్యవధిలో శుభ్రపరుచుకుంటూ మెళుకువలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి బంకా. శ్రీనివాసులురెడ్డి  సచివాలయ ఉద్యోగులు నాగిరెడ్డి, రమాదేవి, నరేంద్ర, వాలంటీర్లు నూతలపాటి.సాయిసంధ్యారాణి, చిట్టీస్ రెడ్డి.పవన్ కుమార్, యాకసిరి. శివయ్య, వెంధోటి.రాధిక, చింతల.చంద్ఫశేళర్ తదితరులు పాల్గొన్నారు